Sushmita Sen: వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్న సుస్మిత.. అందుకే ఇప్పటివరకు పెళ్లిచేసుకోలేదు..

|

Jul 05, 2022 | 9:52 AM

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సుస్మిత సేన్‌ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓ పాపులర్‌ షో ద్వారా పంచుకున్నారు.


మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సుస్మిత సేన్‌ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓ పాపులర్‌ షో ద్వారా పంచుకున్నారు. నాలుగుపదుల వయసు దాటినా పెళ్లిపీటలెక్కని తారల్లో ఒకరైన సుస్మిత… ఇద్దరు పిల్లలను మాత్రం దత్తత తీసుకుని తన మంచి మనసును చాటుకున్నారు. 2015 తర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించని ఈ అందాల తార తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌ షిప్‌, బ్రేకప్‌ వార్తలతో బాగా పాపులర్‌ అయ్యారు. తాజాగా తాను వివాహం చేసుకోకపోవడానికి కారణమేంటో చెప్పారు సుస్మిత. అక్షయ్‌ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘ జీవితంలో తాను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నానని, కానీ ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదన్నారు. అందుకు తన పిల్లలు ఏమాత్రం కారణం కాదని, వారితో తనకెప్పుడూ మంచి సాన్నిహిత్యమే ఉందని చెప్పుకొచ్చారు. తన జీవితంలోకి వచ్చి ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవం ఇచ్చానని చెప్పారు. తాను మూడుసార్లు పెళ్లివరకూ వెళ్లి వెనక్కి వచ్చానని, తనని దేవుడే రక్షించాడని చెప్పుకొచ్చారు సుస్మిత. ఆ వివరాలు చెప్పలేకపోయినా.. దేవుడు తనను, తన పిల్లలను కాపాడుతున్నాడని, గజిబిజి జీవితంలో చిక్కుకోకుండా రక్షిస్తున్నాడని సుస్మిత చెప్పుకొచ్చారు. కాగా మొన్నటివరకు మోడల్ రోహ్మన్ షాల్ తో ప్రేమలో ఉన్నారు సుస్మితాసేన్. అయితే అనూహ్యంగా అతనితో తన బంధం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 05, 2022 09:52 AM