ఘోరమైన పాపం చేశావ్.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న మత పెద్దలు

Updated on: Jan 03, 2026 | 10:41 AM

నటి నుష్రత్ బరూచా ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి దారితీసింది. ఇది ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, నుష్రత్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయితే, నుష్రత్ గతంలోనూ ఆలయాలను సందర్శించారు, అన్ని ప్రార్థనా స్థలాల్లో శాంతి ఉంటుందని నమ్ముతారు. ఈ ఘటన మతపరమైన చర్చను రేకెత్తించింది.

నుస్రత్ బరూచా.. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈమె పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. గతంలో శివాజీతో కలిసి తాజ్ మహల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన నుష్రత్‌.. ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే నుష్రత్ పై ఇప్పుడు ముస్లిం పెద్దలు కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. నుష్రత్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించింది. అక్కడి శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో కొందరు ముస్లిం మత పెద్దలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలీ నుస్రత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ‘నుష్రత్ ఉజ్జయిని ఆలయానికి వెళ్ళి, అక్కడి శివలింగాన్ని అభిషేకించి, ప్రసాదంగా ఇచ్చిన గంధం పూసుకుంది. ఇలాంటి చర్యలు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. షరియా ప్రకారం, నుష్రత్ ఘోరమైన పాపం చేసింది. ఆమె వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పటమే గాక పశ్చాత్తాపంతో కల్మా చదవాలి’ అని మౌలానా డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంపై నుష్రత్ ఇంకా స్పందించలేదు. నిజానికి నుష్రత్ ఉజ్జయిని ఆలయాన్ని దర్శించటం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఈమె చాలా సార్లు వివిధ హిందూ దేవాలయాలను, గుడులను సందర్శించింది. అలాగే ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో కూడా రియాక్టైంది. ఆలయం, మసీదు, చర్చి, పేరు ఏదైనా ప్రార్థనా స్థలాల్లో శాంతిని పొందవచ్చని తాను నమ్ముతానని ఆమె పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్‌ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా

Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..

TOP 9 ET News: పవర్‌ ఫుల్ ట్రైలర్‌ వచ్చేస్తోందోచ్‌… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!

న్యూ ఇయర్‌ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్‌..కారణం ఇదే

సిగరెట్‌ రూ.18 కాదు.. ఇక రూ.72