Bigg Boss OTT: బిగ్ బాస్‌ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో

|

Feb 25, 2022 | 6:17 PM

బుల్లితెర ప్రేక్షకులకు నాన్‏స్టాప్ ఎంటర్‏టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పుడు ఒక గంట... రెండు గంటలు కాకుండా..

బుల్లితెర ప్రేక్షకులకు నాన్‏స్టాప్ ఎంటర్‏టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పుడు ఒక గంట… రెండు గంటలు కాకుండా.. ఈసారి ఏకంగా 24 గంటలు వినోదాన్ని ప్రేక్షకులను చేరువచేసేందుకు బిగ్‏బాస్ ఓటీటీ గా మన ముందుకు వస్తోంది. అంతేకాదు.. ఈ నెల 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ఈ షో స్ట్రీమింగ్ కూడా కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగో.. ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగే.. బిగ్‏బాస్ ఓటీటీకి కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ షోకు ఎవరెవరు వెళ్తున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. వారి గురించి ఆరా తీయడం తాజాగా ఎక్కువవుతోంది.

Also Watch:

Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో

Ukraine – Russia Conflict: రష్యా ఆధీనంలోకి కీవ్ నగరం.. వీడియో