Bigg Boss Telugu 9: డేంజర్‌ జోన్ లో.. సుమన్ శెట్టి

Updated on: Nov 29, 2025 | 10:39 AM

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 9 12వ వారం ముగింపునకు చేరుకుంది. ఉత్కంఠగా మారిన ఎలిమినేషన్‌ ఓటింగ్‌ సరళి ప్రకారం, టాప్‌ కంటెస్టెంట్‌ సుమన్‌ శెట్టి, దివ్య నిఖిత డేంజర్ జోన్‌లో ఉన్నారు. కళ్యాణ్‌ పడాల, తనూజ ముందంజలో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్‌ జరిగే అవకాశం ఉన్నందున, సుమన్‌ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఓటింగ్‌ క్లోజ్ కావడంతో సస్పెన్స్ నెలకొంది.

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 12వ వారం ఎండింగ్ కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇదిలా ఉంటే 12 వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి కళ్యాణ్‌ పడాల, తనూజ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా గల్రానీ, భరణి, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, దివ్య నిఖిత నామినేషన్స్ లో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా జరుగుతోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ కానున్నాయి. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ సరళిని చూస్తుంటే.. కళ్యాణ్ పడాల టాప్ లో కొనసాగుతున్నాడు. తనూజ సెకెండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక మూడో పొజిషన్ లో ఇమ్మాన్యుయెల్‌ ఉండగా, నాలుగో స్థానంలో సంజనా గల్రానీ ఉన్నారు. మొదటి రెండు రోజుల్లో డౌన్‌లో ఉన్న భరణి ఇప్పుడు ఓటింగ్ లో చాలా మెరుగయ్యాడు. ప్రస్తుతం అతను ఐదో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక ఆరో స్థానంలో డిమాన్ పవన్ ఉండగా ఏడో ప్లేసులో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. ఆఖరి స్థానంలో దివ్య నికితా ఉంది. బిగ్ బాస్ హోస్ లో మొదటి నుంచి టాప్ కంటెస్టెంట్ గా ఉన్న సుమన్ శెట్టి ఇప్పుడు డేంజర్ జోన్ లోకి రావడం అందరికీ షాక్‌ నిస్తోంది. జెన్యూన్‌ కంటెస్టెంట్ గా అభిమానుల మనసులు గెల్చుకున్న ఈ కమెడియన్ ఓటింగ్ లో అనూహ్యంగా వెనకబడిపోయాడు. ప్రస్తుతం సుమన్ శెట్టి దివ్యతో పాటు డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఒకవేళ డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటే దివ్యతోపాటు సుమన్‌ శెట్టి కూడా ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం ??

TOP 9 ET News: స్పిరిట్ లో చిరు.. పక్కా సమాచారం..?

Kaantha OTT: అప్పుడే OTTలోకి కాంతా మూవీ

ఎటు చూసినా నీళ్లే.. శ్రీలంకను ముంచిన వరుణుడు

చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం

Published on: Nov 29, 2025 10:38 AM