నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్‌

Updated on: Oct 19, 2025 | 1:29 PM

బిగ్ బాస్ సీజన్ 9లో ఆడాళ్ల మధ్య రోజుకో గొడవ జరుగుతోంది. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లిన మాధురి.. రోజుకొకరితో వాదన పెట్టుకుంటోంది. హౌస్‌లోకి వచ్చీ రాగానే దమ్ము శ్రీజతో పెట్టుకున్న మాధురి.. ఆ తర్వాత దివ్యతో.. పెట్టుకుంది. ఇక ఇప్పుడు రీతూను టార్గెట్ చేసి హౌస్‌లో రచ్చ రచ్చ చేసింది. ఇక రీసెంట్ ఎపిపోడ్ అయిన.. 40th ఎపిసోడ్‌ లో మాధురి,రీతూ మధ్య రాత్రుళ్లు గుస గుసలు పెట్టే విషయంగా పెద్ద లొల్లే అయింది.

నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడుకోండంటూ మాధురి రీతూను ఉద్దేశిస్తూ సీరియస్ అయింది. మీ గుసగుసల వల్ల నిద్ర పట్టడం లేదని.. ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదంటూ ఫైర్ అయింది. మార్నింగ్ కూడా ఎవరైన గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్‌గా ఉండండి.. లేదంటే బయటికి వెళ్లి మాట్లాడుకోండి. మాకు నిద్రపట్టక చస్తున్నాం. నైట్ అంతా చాలా డిస్ట్రబింగ్‌గా ఫీలవుతున్నాం.. అంటూ అరిస్తూ మాట్లాడింది. దాంతో హౌస్ లో ఉన్న మిగిలినవారు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే మాధురి మాటలకు రీతూ చౌదరి రియాక్ట్ అయ్యింది. ఇదేమన్నా బిగ్ బాస్ రూలా .? అంటూ రీతూ కౌంటర్ వేసింది. దాంతో మాధురి మరింతగా రెచ్చిపోయింది. రీతూ పై గట్టి గట్టిగా అరుస్తూ.. పెద్ద సీన్‌నే క్రియేట్ చేసింది. దీంతో రీతూ కూడా.. మాధురి మాటకు.. గట్టిగా సమాధానాలిస్తూ.. గొడవను మరింత పెద్దది చేసింది. ఓ దశలో ఏయ్ ఎక్కువ మాట్లాడకు.. అంటూ మాధురి రీతూపై మరింతగా ఫైర్ అయింది.ఆ మాటలకూ రీతూకు కాలింది.. ఏయ్ గియ్ అంటే పడటానికి ఎవరూ లేరు ఇక్కడ.. నా ఇష్టం నేను నవ్వుకుంటాను.. మాట్లాడతాను అని సీరియస్ గా చెప్పింది. ఇలా వీరిద్దరి మధ్య హౌస్‌లో చిన్న పాటి వార్ నడిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా

దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

బాబోయ్.. ఎల్‌ నినో, లా నినా.. ఈ రెండింటినీ.. గ్లోబల్‌ వార్మింగ్‌ మార్చేస్తోందిగా!

క్రికెట్​లో కొత్తగా ‘టెస్టు ట్వంటీ’ ఎంట్రీ

తిరుమల లడ్డూ ధరల పెంపు? ట్వీట్‌ లో టీటీడీ ఛైర్మన్‌ క్లారిటీ