Bigg Boss Kalyan: చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్

Updated on: Dec 06, 2025 | 11:20 AM

బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. కీలకమైన 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో సైనికుడు కళ్యాణ్ పడాల గెలిచి మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. రీతూ, ఇమ్మాన్యుయెల్ వంటి బలమైన పోటీదారులను ఓడించి చరిత్ర సృష్టించాడు. కళ్యాణ్ ఆటతీరు, వ్యూహాలు అతన్ని బిగ్ బాస్ 9 విజేతగా నిలబెడతాయా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత కీలకమైన ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌లు జరుగుతున్నాయి. ఈ టాస్క్‌లో గెలిచిన కంటెస్టెంట్ నేరుగా సీజన్ ఫైనల్‌కు చేరుకుంటాడు. చివరి దశకు చేరుకున్న ఈ షో మరింత రసవత్తరంగా సాగుతోంది. టఫ్ టాస్క్ లతో ఇంటి సభ్యులకు చెమటలు పట్టిస్తున్నారు బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన సైనికుడు కళ్యాణ్ పడాల సంచలనం సృష్టిస్తున్నాడు. వరుస విజయాలు, పట్టుదలతో కూడిన ఆటతీరుతో టైటిల్ రేస్‌లో దూసుకుపోతున్నాడు. చివరి దశ టాస్క్‌లలో రీతూ , ఇమ్మాన్యుయెల్ వంటి గట్టి పోటీదారులను ఓడించి మొదటి ఫైనలిస్ట్‌గా అవతరించి చరిత్ర సృష్టించాడు కళ్యాణ్. ఇప్పటికే విన్నర్ ట్రోఫీకి చాలా దగ్గరైన కళ్యాణ్ పడాల, ఈ సీజన్ కప్ కొట్టినా కొట్టొచ్చనే మాట సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అనే ఘనతతో ప్రేక్షకులలో అతనిపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మరి కళ్యాణ్ అదృష్టం, ఆటతీరు, స్ట్రాటజీలు అతన్ని బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్‌గా నిలబెడుతుందో లేదో చూడాలి…

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్

పుతిన్ వెంట ‘మలం’ సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్

Published on: Dec 06, 2025 11:19 AM