ఫన్ బకెట్ భార్గవ్‌క 20 ఏళ్ల జైలు శిక్ష
ఫన్ బకెట్ భార్గవ్! టిక్ టాక్ , ఇన్‌స్టా గ్రామ్ రీల్స్‌తో పాపులర్ అయిన ఇతడికి బిగ్ షాక్ తగిలింది. కోలుకోలేనంత ఎదురుదెబ్బతగిలింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా దునియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ అలెర్ట్ అయ్యేలా.. జాగ్రత్తగా ఉండేలా చేస్తోంది.ఇక ఇన్స్టా గ్రామ్లో ఫన్ రీల్స్ చేస్తూ.. పాపులారిటీ సంపాదించిన భార్గవ్ పై గతంలో ఓ 14 ఏళ్ల బాలిక లైంగిక ఆరోపణలు చేసింది.
తన కామెడీ స్కిట్స్‌లో అవకాశం ఇస్తానంటూ చెప్పి లోబరుచుకున్నాడని .. తనను తల్లిని చేశాడని.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని.. భార్గవ్‌ని శిక్షించాలంటూ తన ఫిర్యాదులో పేర్కొంది.ఇక ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు భార్గవ్‌ను ‘దిశ’, పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం పోక్సో కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. ఇక కోర్టులో భార్గవ్ దోషిగా తేలడంతో.. ఇతడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో పాటే బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో భార్గవ్ పేరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.