TRP కోసం మరీ ఇంత నీచమా..! బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు
బిగ్ బాస్ ప్రోమోస్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఫుల్ ఎపిసోడ్‌ను చూసేలా.. టీవీకి అతుక్కుపోయేలా చేయడంలో ఈ ప్రోమోసే కీ రోల్ ప్లే చేస్తుంటారు. అయితే ఈ ప్రోమోలే రీసెంట్ డేస్‌లో అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నాయి. పొట్లాటలు, గొడలు, అరుపులు , గోలలు ... ఈ కంటెంట్‌తో ఓ ప్రోమో వస్తే.. ఆ రోజు ఫుల్ ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఆ రోజు టీఆర్పీ పైకి ఎగబాకుతుంది. ఇక అందుకే అన్నట్టు తమిళ బిగ్ బాస్ టీం ఇప్పుడో గొడవ తాలూకు ఫుటేజ్‌ను ప్రోమోగా మలిచి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. చివరికి ఫుల్ ఎపిసోడ్‌లో అసలు విషయం వేరేగా ఉండడంతో విమర్శలపాలవుతోంది. తెలుగులో మాదిరిగానే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతోంది. ఈ రియాలిటీ షో ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచాయి. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 15 మంది మొదటి నుంచి ఉండగా, ఇటీవలే మరో నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగు పెట్టారు. ఈ మధ్యన తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 ప్రస్తుతం 5వ వారం లో ఉంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ హోరా హోరీగా జరిగింది. ఈ క్రమంలోనే తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్టు ఓ ప్రోమో రిలీజ్ అయింది. దాంట్లో కంటెస్టెంట్లు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. హౌస్‌లోని కమ్రుదిన్, ప్రవీణ్ ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మొదట మాటలతో ప్రారంభమైన ఈ వాగ్వాదం క్రమంగా ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో తారాస్థాయికి చేరుకుంది. కమ్రుదిన్ కోపంతో ప్రవీణ్ రాజ్ పైకి దూసుకెళ్లాడు. ఇతర కంటెస్టెంట్లు వీరిని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కమ్రుదిన్, ప్రవీన్ ఒకరినొకరు నెట్టుకోవడం తోసుకోవడం .. ఈ క్రమంలోనే క్రముద్దీన్ ప్రవీణ్ చెంప కొట్టడం బిగ్ బాస్ టీం రిలీజ్ చేసిన అఫీషియల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో క్లిప్ నెట్టింట తెగ హాట్ టాపిక్ అయింది. షోలో అసలు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ జనాల్లో పెంచింది. ఈ క్రమంలోనే ఈ షో ఫుల్ ఎపిసోడ్ చూసేందుకు టీవీలకే అతుక్కుపోయి ఆడియన్స్‌కు చివర్లో బిగ్ షాక్ తగిలింది. అదో ప్రాంక్ అని తేలింది. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో సక్సెస్ అయ్యేందుకే క్రముద్దీన్ , ప్రవీణ్ హౌస్‌లో ఇలా చేశారు. దీంతో అందరూ ఇప్పుడు ఈ షోను తిడుతూ సోషల్ మీడియాలో దారుణ కామెంట్స్ చేస్తున్నారు. టీఆర్పీ కోసం మరీ ఇలా దిగజారుతారా అంటూ.. షో మేకర్స్‌పై విమర్శలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘చికిరి లాంటి అమ్మాయి.. బీడీ కాలుస్తూ.. కొండకోనల్లో అబ్బాయి !!’ పాట అర్థం చెప్పిన బుచ్చిబాబు
మమ్మల్ని మా ఇంటికి పంపేయండి ప్లీజ్
