Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ దక్కించున్న భరణి
నటుడు భరణి బిగ్‌బాస్‌లో టైటిల్ గెలవకపోయినా అత్యధిక పారితోషికం అందుకున్నారు. వారానికి రూ. 3.5 లక్షల చొప్పున ఆరు వారాలు, రీఎంట్రీ తర్వాత మరో ఆరు వారాలు కలిపి మొత్తం రూ. 42 లక్షలు సంపాదించారు. ఇది విజేత ప్రైజ్‌మనీ రూ. 50 లక్షలకు దాదాపు సమానం. నటుడిగా మంచి గుర్తింపు ఉన్న భరణి.. ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టిన అత్యంత పేరున్న సెలబ్రిటీలలో ఒకరు.
నటుడిగా మంచి గుర్తింపు ఉన్న భరణి.. ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టిన అత్యంత పేరున్న సెలబ్రిటీలలో ఒకరు. అందుకే ఆయనకు మిగిలిన కంటెస్టెంట్‌ల కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ప్యాకేజీ లభించినట్లు ఇండస్ట్రీ వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది. భరణికి వారానికి రూ. 3.5 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరో వారంలోనే తొలిసారిగా ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆరు వారాలకు గాను భరణి సుమారు రూ. 21 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం.. అయితే, ఈ షోకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. ఎనిమిదో వారంలో భరణి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేకు ముందు వరకు అంటే, మరో ఆరు వారాల పాటు హౌస్‌లో కొనసాగారు. రీఎంట్రీ తర్వాత కూడా అదే వారపు రెమ్యునరేషన్ లెక్కించినట్లయితే.. భరణి మరో రూ. 21 లక్షలు అందుకున్నట్లు అంచనా. మొత్తంగా చూస్తే, భరణి ఈ సీజన్‌లో బిగ్‌బాస్ ద్వారా ఏకంగా రూ. 42 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం, ఫైనల్‌కు చేరుకున్న కంటెస్టెంట్‌లు గెలుచుకునే ప్రైజ్‌మనీ రూ. 50 లక్షలకి దాదాపు సమానం ఉంది. టైటిల్ గెలవకపోయినా, అత్యధిక పారితోషికం అందుకున్న వ్యక్తిగా భరణి ఈ సీజన్‌లో భారీగా లాభపడ్డారని తెలుస్తోంది..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??
Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??
కొత్త సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే..దర్శకుడి కొడుకు లిఫ్ట్ ప్రమాదంలో మృతి
Varanasi: వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్
