ఫిజికల్ అయిన పవన్‌, భరణి తీవ్ర గాయాలతో హౌస్‌ బయటకు భరణి..

Updated on: Oct 30, 2025 | 1:11 PM

బిగ్ బాస్ సీజన్ 9 రియాల్టీ షో రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. రమ్య మోక్ష ఎలిమినేషన్ తర్వాత ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ భరణి, దమ్ము శ్రీజ మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అందులోనూ ఇద్దర్లో ఒకరు మాత్రమే హౌస్‌లో ఉంటారంటూ.. వారి మధ్య ఓ పోటీ ఉంటుందంటూ మెలిక పెట్టిన బిగ్ బాస్‌... ఆ టాస్క్‌ను పవర్‌ ఫుల్‌గా డిజైన్ చేశాడు.

అయితే ఆ టాస్క్‌ను ఆడే క్రమంలో భరణికి తీవ్ర గాయాలవడం.. హౌస్‌ నుంచి బయటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు లెవల్స్ లో జరిగిన ఈ టాస్కులలో మొదటి టాస్క్‌ గా కట్టు పడగొట్టు టాస్క్‌ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌ లో ఇద్దరికిచ్చిన స్వేర్స్‌తో ఏడొంతస్తుల మేడ నిర్మించాలంటూ.. మొదట ఎవరు నిర్మిస్తే వాళ్లే విజేతలంటూ బిగ్ బాస్ చెబుతాడు. ఈ టాస్కులో ఇద్దరు కంటెస్టెంట్లకు వారు ఎంచుకున్న హౌస్మేట్స్ సపోర్ట్ చేయాలంటూ బిగ్ బాస్‌ చెప్పాడు. ఈ టాస్కులో భరణి కోసం ఇమ్మాన్యుయేల్, నిఖిల్, సపోర్ట్ చేయగా.. శ్రీజ కోసం డిమాన్, గౌరవ్‌ సపోర్ట్ చేశారు. అయితే ఈ టాస్కు మొదలైన కొద్దిసేపటికే… అందరూ ఫిజికల్ అవ్వడంతో.. ఇమ్ముకు గాయాలయ్యాయి దీంతో… ఇమ్మాన్యుయేల్‌ టాస్క్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడి స్థానంలోకి రాము రాథోడ్ వచ్చాడు. ఇక ఆ తర్వాత టాస్కు మధ్యలో మరో సారి భరణి అండ్ పవన్ ఫిజికల్ అవ్వడంతో.. ఇద్దరూ తోసుకుంటూ స్విమ్మింగ్‌ పూల్లో పడ్డారు. దీంతో అప్పటికే భజం నొప్పితో బాధపడుతున్న భరణి.. మరోసారి తీవ్ర గాయాలపాయ్యాడు. పక్కటెముకలు, భుజం నొప్పితో.. మెడికల్ రూంకు వెళ్లాడు. మెడికల్ రూమ్‌కి వచ్చిన డాక్టర్.. భరణిని పరీక్షించి.. ఆసుపత్రికి వెళ్లాలని.. రెడీ కావాలని చెప్పాడు. దీంతో భరణి మరోసారి హౌస్‌ నుంచి బయటికి వచ్చాడు. ఈ క్రమంలోనే భరణి రీఎంట్రీ పై సస్పెన్స్ పడింది. గాయాలతోనే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా.. ? లేదా విశ్రాంతి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ డైరెక్టర్‌ పెళ్లికి అదిరిపోయే సర్‌‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్‌