Salman Khan: కండలవీరుడు సల్మాన్‌ను ఇబ్బంది పెడుతున్న వరుస సమస్యలు.. అవేనట

Updated on: Sep 28, 2025 | 5:02 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను ఇటీవల పంచుకున్నారు. ఆయన తన ఆరోగ్య సమస్యలను వెల్లడించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలను సైతం ఆశ్చర్యపరిచారు. ఇండియన్ సినిమాకు సిక్స్ ప్యాక్ యాబ్స్‌ను పరిచయం చేసిన నటుడిగా పేరుగాంచిన సల్మాన్, 60 ఏళ్లు పైబడిన వయసులో కూడా ఫిట్‌గా కనిపిస్తారు. అయితే, తాజాగా ఆయన తన ఆరోగ్యం గురించిన నిజాలను బయటపెట్టారు.

సల్మాన్ తాను బ్రెయిన్ ఎన్యూరిజం, ఏవీ మాల్ఫార్మేషన్ వంటి అరుదైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, గతంలో ట్రైజెమినల్ న్యూరాలజియా అనే కండరాల సమస్యతో బాధపడినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సమస్య వల్ల ముఖం భాగంలో తీవ్రమైన నొప్పిని అనుభవించానని, ఒక ఆమ్లెట్ తినడానికి గంటన్నర సమయం పట్టేదని తెలిపారు. అలాంటి నొప్పిని భరిస్తూనే తన పర్ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటైన్ చేయడం ఎంతో కష్టమైన పని అని సల్మాన్ వివరించారు. ఎనిమిది గంటల పాటు శస్త్రచికిత్స చేసిన వైద్యులు తనను ఆ నొప్పి నుంచి విముక్తుడిని చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం, వరుస వైఫల్యాలతో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్ ఖాన్, ఇండియన్ ఆర్మీ నేపథ్యంలోని ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్రకు ముందు బ్యాంకు అకౌంట్లు చెక్‌ నాణ్యమైన నిద్రకు దూరంగా యువత

పదేళ్లుగా పచ్చి ఆకులే అతని ఆహారం. మరి అతడి ఆరోగ్యం పరిస్థితి ఏమిటి?

ఆ రాష్ట్రంలో మనుషుల కంటే పాములే ఎక్కువ !! ఎందుకంటే

టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే

ఫోన్‌ కాల్స్‌ డిస్టర్బ్‌ చేస్తున్నాయా ?? సింపుల్‌ టిప్స్‌.. ఇలా చేయండి

Published on: Sep 28, 2025 05:01 PM