Kishkindhapuri: సగం భయపెట్టి.. సగం వదిలేస్తే ఎలా? హిట్టా..? ఫట్టా..?

Updated on: Sep 12, 2025 | 10:15 PM

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చావు కబురు చల్లగా ఫేం.. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కింధపురి. హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? బెల్లంకొండ కోరుకున్న హిట్ తీసుకొచ్చిందా లేదా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. కిష్కిందపురి సినిమా కథలోకి వెళితే.. రాఘవ్ అలియాస్ బెల్లంకొండ శ్రీనివాస్, మైథిలి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ ప్రేమికులు.. ఒకేచోట పని చేస్తుంటారు. హార్రర్ హౌజ్ అనే కాన్సెప్ట్ తీసుకుని లేని దెయ్యాలను ఉన్నాయని చూపించి జనాలను నమ్మించి.. వాళ్లకు కిక్ ఇస్తుంటారు. అలా ఓసారి కిష్కింధపురి సువర్ణ మాయ రేడియో స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లతో పాటు మరో 8 మంది వస్తారు. అప్పటి వరకు వాళ్లు సెట్ చేసిన మాయలు కాబట్టి ఏం కాదు.. కానీ అక్కడ నిజంగానే ఆత్మ ఉంటుంది. ఆ కిష్కింధపురి ఊరిలో సువర్ణమాయ రేడియో స్టేషన్ నుంచి వచ్చే వింత వాయిస్ విని చుట్టు పక్కల వాళ్లెవ్వరూ అటువైపు కూడా వెళ్లరు. కానీ మన హీరో బ్యాచ్ అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దాంతో అసలక్కడ ఏముంది..? రేడియో స్టేషన్‌లో 1989లో ఏం జరిగింది..? అసలు ఆత్మ కథ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి.. హార్రర్ థ్రిల్లర్స్‌ సినిమాలకు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే..! కథ లేకపోయినా.. కథనం ఉంటే చాలు పాస్ అయిపోతుంటాయి. అయితే కిష్కింధపురి, ఈ విషయంలో సగమే సక్సెస్ అయిందనే చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా మొదలవుతుంది. మరీ ముఖ్యంగా తొలి 10 నిమిషాలు అదిరిపోతుంది. 1989లో కథ ఓపెన్ అయిన వెంటనే వింత శబ్ధాలతో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోయాయి. చాలా క్యూరియాసిటీ మధ్య మొదలైన సినిమా.. ఆ తర్వాత 20 నిమిషాలు నీరసంగా సాగుతుంది. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలి అనిపించే పాట.. బాగా ఇబ్బందికరంగా అనిపించడమే కాదు.. కథకు కూడా అడ్డం పడుతుంది. అరగంట తర్వాత అసలు ఆట మొదలైంది.. ఇంటర్వెల్ వరకు చాలా వేగంగా వెళ్లిపోతుంది కథ. అయితే కొన్ని సీన్స్ వర్కువుట్ అయ్యాయి. ఆ సీన్స్‌ చూస్తున్న ఆడియన్ భయపడడం ఖాయం. స్క్రీన్ ప్లే కూడా బాగా రేసీగా వెళ్లిపోయింది. ముఖ్యంగా ఓ ట్రైన్ సీన్ అయితే నెక్ట్స్ లెవల్. ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వీక్.. దెయ్యానికి ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. దానికితోడు రాఘవ లారెన్స్ తీసిన కాంచన సిరీస్ గుర్తుకొస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటే.!! ఆ తర్వాత కూడా చాలా సేపు నీరసంగానే సాగుతుంది కథ. ప్రీ క్లైమాక్స్ వరకు స్లో నెరేషన్ బాగా ఇబ్బందిపెడుతుంది. క్లైమాక్స్ కూడా కాస్త రొటీన్ అయిపోయింది. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం సినిమాను చూడాలనిపించేలా చేసాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే హార్రర్ సీన్స్ బాగున్నాయి.. సెకండాఫ్ స్మశానం సీన్ కూడా బాగుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. అనుపమ పరమేశ్వరన్ సినిమా అంతా ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో మరో ఎత్తు. సాండీ మాస్టర్ కూడా అదరగొట్టాడు. కొత్త లోక సినిమా తర్వాత మరో ఖతర్నాక్ క్యారెక్టర్ పడింది ఈయనకు. హైపర్ ఆది అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సుదర్శన్ పర్లేదు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం.. మిగిలిన వారందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. హారర్ సన్నివేశాల్లో మనోడి BGM భయాన్ని డబుల్ చేసింది. విజువల్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం ఫస్టాఫ్ వరకు బాగుంది.. కీలకమైన సెకండాఫ్ మాత్రం వదిలేసాడేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు బాగున్నా.. కథనం అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ ఊహించినట్టు అనిపించినా, సీక్వెల్ హింట్ ఇవ్వడం ఆసక్తి రేపుతుంది. రాముడి ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. ఇక ఓవరాల్‌గా కిష్కింధపురి.. సగం భయపెట్టి.. సగం వదిలేసారు..!

హార్రర్ హౌజ్ అనే కాన్సెప్ట్ తీసుకుని లేని దెయ్యాలను ఉన్నాయని చూపించి జనాలను నమ్మించి.. వాళ్లకు కిక్ ఇస్తుంటారు. అలా ఓసారి కిష్కింధపురి సువర్ణ మాయ రేడియో స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లతో పాటు మరో 8 మంది వస్తారు. అప్పటి వరకు వాళ్లు సెట్ చేసిన మాయలు కాబట్టి ఏం కాదు.. కానీ అక్కడ నిజంగానే ఆత్మ ఉంటుంది. ఆ కిష్కింధపురి ఊరిలో సువర్ణమాయ రేడియో స్టేషన్ నుంచి వచ్చే వింత వాయిస్ విని చుట్టు పక్కల వాళ్లెవ్వరూ అటువైపు కూడా వెళ్లరు. కానీ మన హీరో బ్యాచ్ అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దాంతో అసలక్కడ ఏముంది..? రేడియో స్టేషన్‌లో 1989లో ఏం జరిగింది..? అసలు ఆత్మ కథ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి.. హార్రర్ థ్రిల్లర్స్‌ సినిమాలకు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే..! కథ లేకపోయినా.. కథనం ఉంటే చాలు పాస్ అయిపోతుంటాయి. అయితే కిష్కింధపురి, ఈ విషయంలో సగమే సక్సెస్ అయిందనే చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా మొదలవుతుంది. మరీ ముఖ్యంగా తొలి 10 నిమిషాలు అదిరిపోతుంది. 1989లో కథ ఓపెన్ అయిన వెంటనే వింత శబ్ధాలతో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోయాయి. చాలా క్యూరియాసిటీ మధ్య మొదలైన సినిమా.. ఆ తర్వాత 20 నిమిషాలు నీరసంగా సాగుతుంది. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలి అనిపించే పాట.. బాగా ఇబ్బందికరంగా అనిపించడమే కాదు.. కథకు కూడా అడ్డం పడుతుంది. అరగంట తర్వాత అసలు ఆట మొదలైంది.. ఇంటర్వెల్ వరకు చాలా వేగంగా వెళ్లిపోతుంది కథ. అయితే కొన్ని సీన్స్ వర్కువుట్ అయ్యాయి. ఆ సీన్స్‌ చూస్తున్న ఆడియన్ భయపడడం ఖాయం. స్క్రీన్ ప్లే కూడా బాగా రేసీగా వెళ్లిపోయింది. ముఖ్యంగా ఓ ట్రైన్ సీన్ అయితే నెక్ట్స్ లెవల్. ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వీక్.. దెయ్యానికి ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. దానికితోడు రాఘవ లారెన్స్ తీసిన కాంచన సిరీస్ గుర్తుకొస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటే.!! ఆ తర్వాత కూడా చాలా సేపు నీరసంగానే సాగుతుంది కథ. ప్రీ క్లైమాక్స్ వరకు స్లో నెరేషన్ బాగా ఇబ్బందిపెడుతుంది. క్లైమాక్స్ కూడా కాస్త రొటీన్ అయిపోయింది. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం సినిమాను చూడాలనిపించేలా చేసాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే హార్రర్ సీన్స్ బాగున్నాయి.. సెకండాఫ్ స్మశానం సీన్ కూడా బాగుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. అనుపమ పరమేశ్వరన్ సినిమా అంతా ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో మరో ఎత్తు. సాండీ మాస్టర్ కూడా అదరగొట్టాడు. కొత్త లోక సినిమా తర్వాత మరో ఖతర్నాక్ క్యారెక్టర్ పడింది ఈయనకు. హైపర్ ఆది అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సుదర్శన్ పర్లేదు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం.. మిగిలిన వారందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. హారర్ సన్నివేశాల్లో మనోడి BGM భయాన్ని డబుల్ చేసింది. విజువల్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం ఫస్టాఫ్ వరకు బాగుంది.. కీలకమైన సెకండాఫ్ మాత్రం వదిలేసాడేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు బాగున్నా.. కథనం అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ ఊహించినట్టు అనిపించినా, సీక్వెల్ హింట్ ఇవ్వడం ఆసక్తి రేపుతుంది. రాముడి ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. ఇక ఓవరాల్‌గా కిష్కింధపురి.. సగం భయపెట్టి.. సగం వదిలేసారు..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీటు కోసం చితక్కొట్టుకున్న మహిళ, యువకుడు

IPHONE 17: ఐ ఫోన్ 17.. అక్కడ 97 వేలు.. మనకి 1.36 లక్షలు

GST on Petrol Diesel:పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గింపు కష్టమే..!

The World’s Billionaires: వెనుకబడ్డ ఎలన్‌ మస్క్‌.. ప్రపంచ కుబేరుడిగా ల్యారీ ఎల్లిసన్

సింపుల్‌గా ముగించేసిన దీపిక కూతురి పుట్టినరోజు వేడుక!

Published on: Sep 12, 2025 09:28 PM