‘ చెప్పాల్సింది చెప్పేశా. ఇంకేమీ లేదు’

Updated on: Sep 30, 2025 | 4:41 PM

తాజాగా, అసెంబ్లీలో బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పటికీ నెట్టింట హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. దానికి బదులుగా.. మెగాస్టార్ ఇచ్చిన పత్రికా ప్రకటన, ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ బాలయ్యకు ఇచ్చిన వార్నింగ్..! ఇలా బాలయ్య వర్సెస్ చిరు మధ్య, వారి ఫ్యాన్స్ మధ్య, సోషల్ మీడియాలో చిన్న పాటి వార్ నడుస్తోంది.

ఈక్రమంలోనే వెకేషన్‌ను ముగించుకుని హైద్రాబాద్‌కు వచ్చిన చిరు మరోసారి బాలయ్య కామెంట్స్ పై రియాక్టయ్యారు. హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో దిగాడని తెలుసుకున్న తెలుగు మీడియా ప్రతినిధులు .. ఎయిర్‌ పోర్టులో చిరును ఇదే విషయంపై ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడాలని కోరినా.. చిరు మాత్రం… విలేకరుల ప్రశ్నలను దాటవేశారు. ఇప్పటికే తాను చెప్పాల్సిందంతా చెప్పానని, ఇక.. మాట్లాడాల్సిందేం లేదని క్లారిటీ ఇస్తూనే.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మరో వైపు చిరును చూసేందుకు.. రిసీవ్ చేసుకునేందుకు భారీ సంఖ్యలో మెగా ఫ్యాన్స్ ఎయిర్‌ పోర్టుకు వచ్చారు. అయితే వారికి మాత్రం చిరు.. సెల్ఫీలిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోలు.. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్రిస్తుండగా ఘోర ప్రమాదం !! వీర హనుమాన్ చైల్డ్‌ ఆర్టిస్ట్ మృతి

Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కి అనవసరంగా వెళ్లా.. నా జీవితం ఫినిష్ అనుకున్నా

అసలు మొలకలు ఏ టైంలో తినాలో తెల్సా?

పాపం ప్రియ! తప్పుదిద్దుకునే లోపే.. బయటికి..! అటు రెమ్యునరేషన్‌ కూడా తక్కువే

‘నీ స్వార్థం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు’ కయాదు సంచలన ట్వీట్