Balakrishna: బాలయ్య నువ్వు మామూలోడివి కాదయ్యా.. ఫ్యాన్స్అం చనాలు మరింత పెంచేస్తున్నావుగా..
బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ మహర్దశలో ఉన్నారు, "అఖండ" తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్నారు. "అఖండ 2" భారీ బడ్జెట్‌తో, 120 కోట్ల బిజినెస్‌తో రానుంది, సనాతన ధర్మం ఇతివృత్తంతో నార్త్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ తర్వాత గోపీచంద్ మలినేనితో పీరియడ్, ద్విపాత్రాభినయ ప్యాన్ ఇండియా చిత్రానికి సిద్ధమవుతున్నారు.
బలం ఉన్నోన్నైనా గెలవొచ్చు కానీ అదృష్టం ఉన్నవాన్ని అస్సలు గెలవలేం.. పైగా లక్కుకు తోడు బలం కూడా ఉంటే కాంబినేషన్ బ్లాక్‌బస్టర్. తాజాగా బాలయ్య విషయంలో ఇదే జరుగుతుంది. చిన్నపుడు చదువుకున్న మిడాస్ టచ్ గుర్తుకొస్తుంది ఈయన జోరు చూస్తుంటే..! ఇక తెలుగు కాదు.. నెక్ట్స్ అంతా ప్యాన్ ఇండియానే అని దూకేస్తున్నారు NBK. 60 దాటిన తర్వాత మహర్ధశ పడుతుందని పెద్దోళ్లు చెప్తుంటారు కదా..? దానికి సాక్ష్యం కావాలంటే బాలయ్యను చూపిస్తే సరిపోతుంది. అసలు అఖండ నుంచి ఆయన రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే ప్యాన్ ఇండియన్ హీరోలకి కూడా కంటిమీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా అఖండ 2 అన్ని బ్యారియర్స్ తెంచేయాలని ఫిక్స్ అయిపోయారు నటసింహం. అఖండ 2 ప్రమోషన్స్ పీక్స్‌లో జరుగుతున్నాయి. ఈసారి ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారు నటసింహం. మామూలుగానే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే పూనకాలు ఖాయం.. ఈసారి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పీక్స్‌కు చేరిపోయాయి. అఖండ 2 బిజినెస్ అయితే 120 కోట్లకు పైగా జరుగుతుంది.. కేవలం బ్రేక్ ఈవెన్ కోసమే 250 కోట్లు వసూలు చేయాలి అఖండ 2. బాలయ్య కెరీర్‌లో మొదటి ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా వస్తుంది అఖండ 2. పైగా సినిమాలో సనాతన ధర్మం, హిందుత్వం ఎక్కువగా ఉంది కాబట్టి నార్త్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు బోయపాటి. దీని తర్వాత నెక్ట్స్ చేయబోయే గోపీచంద్ మలినేని దీనికంటే భారీగా ప్లాన్ చేస్తున్నారు. యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ.. 2021లో బోయపాటితో అఖండ చేసాక గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి చేసారు బాలయ్య. ఇప్పుడూ అంతే.. అఖండ 2 తర్వాత మళ్లీ గోపీచంద్‌తోనే సినిమా చేస్తున్నారు. ఇందులో కూడా ఈయన ద్విపాత్రాభినయమే. పైగా ఈసారి పీరియడ్ కథ.. ప్యాన్ ఇండియా టార్గెట్. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది