Balakrishna: నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్
బాలయ్య తన అభిమానుల అంచనాలకు తగ్గట్టు మామూలు చిత్రాలు చేయనంటున్నారు. అఖండ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో కదలిక తెచ్చిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111తో సిద్ధమవుతున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు. నయనతారతో నాలుగోసారి కలిసి పనిచేస్తూ, తెలుగు ప్రాజెక్టులతో పాన్ ఇండియా హీరోగా తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నారు.
మామూలు సినిమాలు మా ఫ్యాన్స్ కి మజా ఇవ్వవు. నేనంటూ రంగంలోకి దిగితే నెక్స్ట్ రేంజ్ ఎక్స్ పెక్ట్ చేస్తారని అంటున్నారు బాలయ్య. జస్ట్ అనడమే కాదు, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లోనూ ఆ విషయం పగడ్బంధీగా కనిపిస్తోంది. ఇంతకీ నందమూరి హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అఖండ మేనియా మామూలుగా లేదు జనాల్లో. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. బాలకృష్ణ – బోయపాటి కాంబోకి సహజంగా ఉండే క్రేజ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. అందుకే ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది టీమ్. అఖండ2 రిలీజ్‌కన్నా ముందే గోపీచంద్ మలినేని మూవీకి ముహూర్తం పెట్టేశారు బాలయ్య. ఆ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. ఒకటికి రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు నందమూరి అందగాడు. యోధుడిగా, మెడలో రుద్రాక్షలతో కనిపించే మరో వ్యక్తిగా బాలయ్యను డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ఎన్బీకే111 మీద కూడా జనాలకు ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఆల్రెడీ క్లిక్ అయిన వీరసింహారెడ్డి కాంబినేషన్ మాస్ జనాలను అట్రాక్ట్ చేయడంలో గోల్ మిస్ కాదనే మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫీస్ట్ రెడీ అంటూ బజ్ క్రియేట్ అవుతోంది.బాలకృష్ణతో నయనతార నాలుగో సారి నటిస్తున్న సినిమా ఇది. బాలయ్యకి కలిసొచ్చిన నాయిక నయన్ అంటూ పెయిర్‌ని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. జైలర్ సీక్వెల్ నుంచి తప్పుకున్న బాలయ్య ఇప్పుడు తెలుగు ప్రాజెక్టులతో ప్యాన్ ఇండియా హీరోగా మెప్పించే ప్రయత్నాల్లో స్పీడ్ పెంచేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
