బాహుబలి ది ఎపిక్‌ ప్రమోషన్స్‌లో ట్విస్ట్‌.. నెక్స్ట్ లెవల్‌ స్కెచ్ వేసిన జక్కన్న

Updated on: Oct 29, 2025 | 1:38 PM

"బాహుబలి ది ఎపిక్" రీరిలీజ్ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రానికి ఒకరోజు ముందే ప్రీమియర్‌లు ప్లాన్ చేశారు. డాల్బీ సినిమా, ఐమాక్స్ సహా 10 ఫార్మాట్లలో రీమాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. ప్రభాస్, రాజమౌళి, రానా కలిసి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో కూడా విడుదలైంది, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

“బాహుబలి ది ఎపిక్” రీరిలీజ్ తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. గతంలో పలు చిత్రాలు రీరిలీజ్ అయినప్పటికీ, “బాహుబలి” చిత్రబృందం కల్పిస్తున్నంత బజ్ మరెవ్వరూ సృష్టించలేకపోయారు. ఈ ప్రచార పర్వాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా చిత్ర బృందం ఒక పెద్ద ట్విస్ట్‌ను ప్రకటించింది. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాకు ఒకరోజు ముందే ప్రీమియర్‌లను ప్లాన్ చేస్తున్నారు. రీరిలీజ్ సినిమాకు ప్రీమియర్‌లు వేయడం టాలీవుడ్‌లో ఒక రికార్డుగా సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. సాంకేతికంగానూ గతంలో ఏ చిత్రానికీ చేయనంత భారీగా రీమాస్టర్ వర్క్ జరుగుతోంది. తొలి విడుదలలో ఒకట్రెండు ఫార్మాట్లలో మాత్రమే “బాహుబలి”, “బాహుబలి 2” విడుదలయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shruti Haasan: నార్త్, సౌత్‌కున్న తేడాని గమనించిన శృతిహాసన్

Weather Update: నవంబరు 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

మందుబాబులు అలర్ట్ !! ఇక తాగి వాహనం నడిపితే

మూడు రాష్ట్రాలపై తుఫాన్‌ పడగ.. మొంథా మొత్తం తుడిచేస్తుందా