Baahubali: బాహుబలి టీంలో రీ రిలీజ్ జోష్.. క్రేజ్ మామూలుగా లేదుగా
ఇండియన్ సినిమాలో మైల్‌స్టోన్ లాంటి మూవీస్ చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో అన్నింటికన్నా ముందుంటుంది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ బాహుబలి. అప్పటి వరకు ఉన్న సినిమా మేకింగ్, టేకింగ్, ప్రమోషన్స్ స్టైల్స్‌ను మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. త్వరలో రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా మరోసారి న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతుంది.
బాహుబలి రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ వరల్డ్‌లో మరిన్ని సినిమాలు ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి 3 ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు స్వయంగా చెప్పారు. కానీ అవేవి పట్టాలెక్కలేదు. కానీ బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్. బాహుబలి వన్ అండ్ టూ… రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజే అయినా ప్రమోషన్ విషయంలో స్ట్రయిట్ మూవీ రేంజ్‌లో కేర్ తీసుకుంటున్నారు రాజమౌళి. ముఖ్యంగా ఓటీటీలో ఒరిజినల్ వర్షన్స్ అందుబాటులో లేకుండా రిమూవ్ చేయించారు. దీంతో రీ రిలీజ్ మీద మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఈ అక్టోబర్‌ను బాహుబలి మంథ్‌గా ప్రకటించిన యూనిట్, అభిమానులను మహిష్మతి వారియర్స్‌గా చెబుతూ… మర్చంటైజ్‌ను గెలుచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. బాహుబలి మెమరీస్‌ను గుర్తు చేసుకుంటూ… యూనిట్ పెట్టే కాంపిటీషన్స్‌లో పాల్గొంటూ అభిమానులు ఈ గిఫ్ట్‌లు గెలుచుకోవచ్చు. ప్రజెంట్ రీ మాస్టర్ వర్క్స్‌తో బిజీగా ఉన్న జక్కన్న, త్వరలో ప్రమోషన్స్ మరింత పీక్స్‌కు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా
దెబ్బ మీద దెబ్బ.. మూసీవాసులకు నిద్రలేకుండా చేస్తున్న పాములు.. ఇంత ఉన్నాయేంటి మావ
Rajinikanth: డివోషనల్ ట్రిప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణం అదేనా ?
TOP 9 ET News: OG ప్రీక్వెల్‌లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన సుజీత్
Keerthy Suresh: కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు.. అస్సలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు
