Game Changer: గేమ్ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
శంకర్ డైరెక్షన్లో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఏపీలోని కూటమి ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించింది.
అలాగే మొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది. ఆ తర్వాత 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టిక్కెట్ రేట్లు పెంపునకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు పెంచుకోవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంచుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించిన జీవీను.. ఏపీ ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ratan Tata Statue: ఉండిలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్