Anushka: అనుష్క అజ్ఞాతవాసం ఇంకెన్నాళ్లు

Edited By: Phani CH

Updated on: Nov 02, 2025 | 8:48 PM

బాహుబలి ది ఎపిక్‌ ప్రమోషన్స్‌లో అయినా అనుష్క కనిపిస్తారేమో అని ఆశగా ఎదురుచూశారు ఫ్యాన్స్‌. ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా... తమన్నా వీడియో మేసేజ్‌ అయినా ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఈ మెగా మూవీ రీ రిలీజ్‌లోనూ స్వీటీ కనిపించలేదు. అసలు అనుష్క కెమెరాల ముందుకు ఎందుకు రావటం లేదు? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ క్వశ్చన్‌.

సైజ్‌ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత నార్మల్‌ లుక్‌లోకి రావటంలో ఇబ్బంది పడ్డారు. దీంతో సినిమాలు కూడా తగ్గించేశారు. చేసిన సినిమాల్లో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి. భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాలు పరవాలేదనిపించినా… స్వీటీ రేంజ్‌కు తగ్గ హిట్ మాత్రం పడలేదు. లాంగ్ గ్యాప్ తరువాత రీసెంట్‌గా ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ బ్యూటీ. ఘాటీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో కనిపించలేదు అనుష్క. దీంతో అభిమానుల్లో చాలా అనుమానాలు క్రియేట్ అయ్యాయి. అసలు అనుష్క ఆడియన్స్ ముందుకు రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారన్న డిస్కషన్ మొదలైంది. అనుష్క తెర మీద కనిపిస్తున్న లుక్ విషయంలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్‌లో ఆడియో ఇంటర్వ్యూలు మాత్రమే ఇవ్వటంతో స్వీటీ ఎందుకు కనిపించటం లేదన్న డిస్కషన్ మరింతగా జరిగింది. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్‌ రిలీజ్ సమయంలో మరోసారి స్వీటీ పేరు తెర మీదకు వచ్చింది. మూడు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌, గ్లోబల్ మూవీ చేస్తున్న రాజమౌళి కూడా రీ రిలీజ్‌ ప్రమోషన్స్‌లో కనిపించారు. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్‌కు రాకపోవటం వెనుక రీజన్‌ ఏంటన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ప్రమోషన్సే చేయనని భీష్మించుకున్న నయనతార కూడా ఇప్పుడు మనసు మార్చుకొని తన సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. కానీ స్వీటీ మాత్రం ప్రమోషన్స్‌లో కనిపించకపోవటం ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prashanth Varma: ప్రశాంత్‌ వర్మ Vs నిర్మాతలు.. నిజమేనా ??

నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే

రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నవంబర్‌ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??

వినియోగదారులకు అలర్ట్‌.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!

Published on: Nov 02, 2025 08:45 PM