అనుపమ.. ధృవ్ ప్రేమ వ్యవహారం నిజమేనా
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రేమ వివాహం చేసుకుంటానని ఆమె చెప్పడంతో, ధృవ్ విక్రమ్‌తో ఆమె ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. బైసన్ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి ప్రేమ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె మాటలతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ కలిసి నటించిన బైసన్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా అనుపమ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆమె ప్రేమ జీవితం గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ఆరు సినిమాలతో కెరీర్‌లో మంచి జోరు మీదున్న అనుపమ, తన వ్యక్తిగత జీవితంలోనూ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ, తాను ప్రేమ వివాహం చేసుకుంటానని స్పష్టం చేశారు. అయితే, తల్లిదండ్రులను ఒప్పించిన తర్వాతే తన పెళ్లి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్‌లో హారర్ మూవీ, రామ్ గోపాల్ వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??
ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
తరుముకొస్తున్న మొంథా తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్
