AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు.? చెర్రీ ప్రశ్నకు మహీంద్రా సూపర్ రిప్లై.

Ram Charan: నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు.? చెర్రీ ప్రశ్నకు మహీంద్రా సూపర్ రిప్లై.

Anil kumar poka
|

Updated on: Mar 26, 2024 | 8:27 AM

Share

సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే యాక్టివ్‌గా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌..ఉన్నంట్టుండి.. ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. తనను సుజీత్ పెళ్లికి ఎందుకు పిలవలేదంటూ ఆయన్ను ప్రశ్నించారు. అందుకు ఆనంద్ కూడా.. కాస్త బిజీగా ఉండి పిలవలేకపోయా అంటూ.. చెర్రీకి ఆన్సర్ ఇచ్చారు. అయితే వీరి ట్వీట్లు చూసిన నెటిజన్స్ ఇప్పుడు షాకవుతున్నారు.

సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే యాక్టివ్‌గా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌..ఉన్నంట్టుండి.. ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. తనను సుజీత్ పెళ్లికి ఎందుకు పిలవలేదంటూ ఆయన్ను ప్రశ్నించారు. అందుకు ఆనంద్ కూడా.. కాస్త బిజీగా ఉండి పిలవలేకపోయా అంటూ.. చెర్రీకి ఆన్సర్ ఇచ్చారు. అయితే వీరి ట్వీట్లు చూసిన నెటిజన్స్ ఇప్పుడు షాకవుతున్నారు. ఎవరీ సుజీత్? అతడి పెళ్లికి చెర్రీ ఎందుకు వెళ్లాలని అనుకున్నారు? పెళ్లికి పిలవలేదని ఆనంద్ మహీంద్రనే.. చెర్రీ ఎందుకు ట్యాగ్ చేశాడు? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.

ఇక అసలు విషయానికి వస్తే.. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారడమే మహీంద్రా లక్ష్యమని పేర్కొంటూ ఆ సంస్థ ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంతంలో మహీంద్రా ఫ్యాక్టరీ నిర్మించడమే కాకుండా.. అక్కడ లక్షలాది మంది చెట్లు నాటారని.. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించడంతో అక్కడ దాదాపు 400 అడుగులు అండర్ గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగిందని.. దీంతో ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి తీరిందని ఆ యాడ్‌లో తెలిపింది. ఇన్నాళ్ళు నీటి ఎద్దడి కారణంగా ఆ గ్రామంలోని అబ్బాయిలకు ఎవరు పిల్లను ఇవ్వలేదని.ఇప్పుడు ఆ పాత్రంలో నీటి ఎద్దడి తగ్గడంతో అక్కడ చాలాకాలంగా బ్రహ్మచారిగా ఉన్న సుజీత్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని కూడా ఆ వీడియోలోనే చూపించింది.

ఇక ఈ యాడ్ వీడియోను ట్యాగ్ చేసిన చెర్రీ అందులో చూపించిన సుజీత్‌ పెళ్లికి నన్నెందుకు పిలవలేదు ?.. అంటూ ఆనంద్ మహీంద్రా.. కు ట్వీట్ చేశారు. అంతేకాదు జహీరాబాద్ కు దగ్గర్లోనే తాను ఉండేదని.. పిలిస్తే.. తన స్నేహితులను సరదాగా కలిసివాడినని తన ట్వీట్లో రాసుకొచ్చారు చెర్రీ. అంతేకాదు ఏదేమైనా మీది గ్రేట్ వర్క్ అంటూ ఆనంద్ మహీంద్రా సేవలను తన ట్వీట్లోనే కొనియాడారు. ఇక చరణ్ పోస్ట్ కు ఆనంద్ మహీంద్రా స్పందించారు. “గందరగోళంలో ఉండి మీకు ఆహ్వనం పంపించడం మర్చిపోయా.. మీ శిక్షణ ఆధారంగా నా డాన్స్ ను మెరుగుపరుచుకునే పనిలో ఉండిపోయాను. మా ప్రకటన పట్ల స్పందించినందుకు ధన్యవాదుల. ఇదెంతో సానుకూల ప్రభావం చూపుతుందని అనుకుంటున్నాను. మరోసారి మిస్ కావాలనుకోవడం లేదు. అందుకే ఇప్పుడే చెబుతున్నాను.. హ్యాపీ బర్త్ డే ఇన్ అడ్వాన్స్ ” అంటూ రిప్లై ఇచ్చారు. వీరి ట్వీట్లతో ఇప్పుడు ఇద్దరూ నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..