Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన ప్ర‌మాదం

Updated on: Jan 11, 2026 | 4:38 PM

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో విమానాశ్రయం ద్వారం వద్ద గ్లాస్ పగిలిపోయింది. పెచ్చులు పడినప్పటికీ అమితాబ్ సురక్షితంగా బయటపడ్డారు. నిధి అగర్వాల్, సమంత వంటి ఇతర తారలు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. తనపై చూపిన ప్రేమకు బిగ్ బి బ్లాగ్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

బాలీవుడ్‌ బాద్‌షా, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో ఓ గ్లాస్‌ అమితాబ్‌ పక్కనే పగిలిపోయింది. పెద్ద శబ్దంతో పగిలిపోయి పెచ్చులు అమితాబ్‌ వైపు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదానికి కారణం ఫ్యాన్స్‌ అభిమానం సృతిమించడమే. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవ‌ల ఫ్యాన్స్ అత్యుత్సాహం నిధి అగ‌ర్వాల్, స‌మంత‌, విజ‌య్, త‌నూజ ఇలా ప‌లువురిని ఇబ్బందికి గురి చేసింది. ఇక ఇప్పుడు ఇదే జాబితాలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా చేరారు. సూరత్ ఎయిర్ పోర్ట్‌లో అమితాబ్‌ను చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ త‌ర‌లివచ్చారు. ఆయ‌న త‌న కారు వ‌ద్ద‌కు చేరుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది. అభిమానుల తాకిడి ఒకేసారి ఎక్కువ కావ‌డంతో విమానాశ్ర‌యం ద్వారం వ‌ద్ద ఉన్న గ్లాస్ ప‌గిలిపోయింది. ఆ స‌మ‌యంలో అమితాబ్ కాస్త దూరంగా ఉండ‌డంతో ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే తనపై అభిమానులు చూపుతున్న ప్రేమను మాటల్లో వివరించడం కష్టమని చెప్పిన అమితాబ్, ఇంతటి ఆప్యాయత తనకు ఎలా దక్కిందన్నది తనకే ఒక మిస్టరీలా అనిపిస్తోందని పేర్కొన్నారు. తాను చేసిన పనులకన్నా ఎంతో ఎక్కువగా అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని, ఆ అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేనని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Raja Saab: ధురంధర్ రికార్డ్ బద్దలుకొట్టిన రాజాసాబ్

RGV: చిన్న పిల్లలు కూడా ఏదైనా చూడగలుగుతున్నారు కదా.. సెన్సార్‌ బోర్డ్‌ పై RGV బిగ్ పంచ్‌

చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు

సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్‌ ప్రొడ్యూసర్ ఎమోషనల్..

AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన