శిరీష్‌ ఎంగేజ్‌మెంట్‌పై వర్షం దెబ్బ.. ఆగమైన ఏర్పాట్లు..! శిరీష్‌ ఎమోషనల్

Updated on: Oct 31, 2025 | 11:46 AM

అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే అంతా సంతోషమే.. కానీ అలా జరగకపోతే.. బాధే కదా..! ఇప్పుడు అల్లు శిరీష్‌లోనూ అదే బాధ కనిపిస్తోంది. శుభమాని గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటే.. తన ఎంగేజ్‌మెంట్‌ వేదికను తుఫాను నాశనం చేసిందని.. ట్వీట్లో ఆవేధన వ్యక్తం చేశాడు శిరీష్‌. ఎట్ ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బిగ్ బ్రేక్‌ కోసం ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్‌..

అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే అంతా సంతోషమే.. కానీ అలా జరగకపోతే.. బాధే కదా..! ఇప్పుడు అల్లు శిరీష్‌లోనూ అదే బాధ కనిపిస్తోంది. శుభమాని గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటే.. తన ఎంగేజ్‌మెంట్‌ వేదికను తుఫాను నాశనం చేసిందని.. ట్వీట్లో ఆవేధన వ్యక్తం చేశాడు శిరీష్‌. ఎట్ ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బిగ్ బ్రేక్‌ కోసం ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్‌.. తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా తన మనసులోని మాటను అందరికీ షేర్ చేసుకున్నాడు. అక్టోబర్‌ 31న నయనికతో తన ఎంగేజ్‌మెంట్‌ జరుగుతోందంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. అంతేకాదు తన పెళ్లి చూడాలని తన నానమ్మ రత్నమ్మకి ఎంతో ఆశ ఉండేదని.. కానీ, ఆ కల నెరవేరకుండానే తన నానమ్మ కన్నుమూసిందని.. తను మా మధ్య లేకపోయినా.. తన దీవెనలు ఎప్పుడూ తతనకు, తన కుంటుంబానికి అండగా ఉంటాయంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు శిరీష్‌. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 31న జరగబోయే తన ఎంగేజ్‌మెంట్‌ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ తుఫాను ప్రభావం వల్ల వాతావరణంలో సడన్‌గా మార్పులు రావడం.. అకస్మాత్తుగా వర్షాలు పడడంతో.. శిరీష్‌ ప్లాన్ అంతా తలకిందులైంది. ఓపెన్ లాన్‌లో ఈ వేడుక చేసుకుందామనుకున్న శిరీష్‌కు వర్షం పెద్ద అండ్డంకిగా మారింది. చేసిన డెకరేషన్‌, వేదిక.. పూర్తిగా వర్షంలో తడిచిపోయింది. దీంతో ఫీలైన ఈ హీరో… తాజాగా ఓ ట్వీట్ ద్వారా తన డిస్సపాయింట్ మెంట్‌ను తెలియజేవాడు. బయట ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందామని ప్లాన్‌ చేశాం. కానీ, వాతావరణం.. దేవుడి ప్లాన్స్‌ మరోలా ఉన్నాయి అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీతూ గేమ్ క్లోజ్ ఇక !! పవన్ తో మాధురి నయా స్ట్రాటజీ

TOP 9 ET News: కమల్–రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో

అందరూ అదే చేస్తే.. బాబుకు షాకిచ్చిన గోదావరి బుడ్డోడు

మొంథా ఎఫెక్ట్‌.. ఉప్పాడకు కొట్టుకొచ్చిన బంగారం

ప్రాణాలు కాపాడిన డ్రోన్లు.. ఎలాగో వీడీయో మీరే చూడండి