నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్
పుష్పతో ఘనవిజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమా సీక్వెల్ కు సిద్ధమవుతునన్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ పక్కా ఫ్యామిలీ మేన్ అని చెప్పాలి.
పుష్పతో ఘనవిజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమా సీక్వెల్ కు సిద్ధమవుతునన్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ పక్కా ఫ్యామిలీ మేన్ అని చెప్పాలి. షూటింగ్ లేని సమయమంతా కుటుంబమే ఆయనకు ప్రపంచం. ముఖ్యంగా, తన పిల్లల పట్ల ఆయన చూపించే ప్రేమానురాగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా, తన ముద్దుల తనయ అల్లు అర్హ గురించి బన్నీ ఆసక్తికర ట్వీట్ చేశారు. నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు… నీ పట్ల గర్విస్తున్నాను బేబీ అంటూ పోస్టు చేశారు. అల్లు అర్హ స్కూల్లో ఓ క్లాస్ పాసై నెక్ట్స్ క్లాస్ కు వెళుతున్న సందర్భంగా బన్నీ ఈ పోస్టు చేసినట్టు తెలుస్తోంది.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos