Pushpa 2 Records: పుష్ప 2 రికార్డుల మోత.! కలెక్షన్స్ రూపంలో రూ.కోట్ల వర్షం..

|

Dec 03, 2024 | 10:09 AM

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కాగా నవంబర్ 30న మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో నవంబర్ 30నే పుష్ప 2 టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సినీ అభిమానులు అల్లు అర్జున్ మూవీ టికెట్లను బుక్ చేసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. ఈక్రమంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో టిక్కెట్లు బుక్ అయ్యాయి.

పుష్ప 2 టికెట్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రభాస్ ‘బాహుబలి 2’ రికార్డును ‘పుష్ప 2’ సినిమా బద్దలు కొట్టే అవకాశాలున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. తెలంగాణలో శనివారం సాయంత్రం స్టార్ట్ కాగా, కేరళలో డిసెంబర్ ఒకటిన అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అయినా నిన్న దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లలో 55,000 కంటే ఎక్కువ టిక్కెట్లు ముందస్తుగా బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలిరోజే 2.79 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి.

డిసెంబర్ 01న కేరళలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఓపెనింగ్ అయిన వెంటనే ప్రధాన థియేటర్లలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఆంధ్రాలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఒక్కసారి టిక్కెట్ బుకింగ్ ఓపెన్ అయితే.. ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు కేవలం ఒక రోజు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా 15 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని సమాచారం. సినిమా విడుదలకు మరో నాలుగు రోజలు సమయం ఉంది. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల ద్వారానే దాదాపు వంద కోట్ల కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక అమెరికాలో ‘పుష్ప 2’ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఇప్పటివరకు రూ.16 కోట్ల టిక్కెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి. ఇక డిసెంబర్ 04న ఉత్తర అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 05న ఈ సినిమా ఇండియాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణలో కూడా డిసెంబర్ 04 న పుష్ప 2 బెనిఫిట్ షోస్ పడనున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.