Allu Arjun: మాటల్లేవ్ అంతే..! ‘కాంతార’పై బన్నీ మాస్ రివ్యూ
కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను చూసి... నచ్చితే ఆ మూవీ మేకర్స్‌ను అప్రిషియేట్ చేసే అలవాటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మరో సారి అదే చేశారు. రిషబ్ షెట్టి దర్శకత్వంలో తెరకెక్కి, సూపర్ డూపర్ హిట్టు టాక్ తెచ్చుకున్న కాంతార చాప్టర్ 1 సినిమాను బన్నీ రీసెంట్‌గా చూశాడు. చూడడమే కాదు.. తనకు నచ్చేసిందంటూ సినిమాపై చిన్న రివ్యూ ఇచ్చేశాడు.
దాంతో పాటే ఈ మూవీ టీంను కూడా పేరు పేరుగా ప్రశంసించాడు. కాంతార సినిమా అద్బుతంగా ఉందని, మైండ్ బ్లోయింగ్ అని తన ట్వీట్‌తో ప్రశంసలు కురిపించాడు బన్నీ. నిన్న రాత్రి ‘కాంతార ఛాప్టర్ 1 సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను. రచయిత, దర్శకుడు, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషభ్ శెట్టికి అభినందనలు. ఆయన ప్రతీ క్రాఫ్ట్‌లోనూ అద్బుతంగా రాణించారు. హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటన అద్భుతం. జయరాం, గుల్షన్ దేవయ్య, ఇతర టెక్నికల్ టీం వర్క్ సూపర్బ్ గా ఉంది. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి గంగే ఆర్ట్ డైరెక్షన్, అర్జున్ రాజ్ స్టంట్స్, ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఇలా టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే మాటలు సరిపోవు అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు బన్నీ. ఇక దసరా కానుకగా అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. సుమారు 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుల కెక్కింది. కేవలం కన్నడలోనే కాదు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లోనూ కాంతార ఛాప్టర్ 1 సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది. వారం వారం కొత్త సినిమాలు రిలీజవుతున్నా ఈ డివోషనల్ మూవీ జోరు మాత్రం తగ్గడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఫౌజీ’ టైటిల్‌లో సంస్కృత శ్లోకాలు.. వాటి అర్థం ఏంటంటే
చనిపోయాడని నదిలో నిమజ్జనం.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి.. ఏం జరిగింది
డీమ్యాట్ ఖాతాలో రూ. 2,817 కోట్ల సంపద.. కాసేపటికే అంకెలన్నీ మాయమై
చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ గది ఇదే.. నెట్టింట ఫుల్ ట్రెండ్
