Abhi: ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు! అభి కామెంట్స్!

Updated on: Dec 19, 2025 | 5:26 PM

అదిరే అభి డైరెక్టర్‌గా మారి, రాజ్ తరుణ్ నటించిన 'జై చిరంజీవ' సినిమాతో ఆహాలో విజయం సాధించారు. ఈ ప్రమోషన్లలో భాగంగా, తన మొదటి సినిమా ప్రభాస్ 'ఈశ్వర్' కోసం కేవలం ₹11,000 మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు అభి షాకింగ్ నిజం వెల్లడించారు. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది, అభి ప్రయాణంలోని ప్రారంభ కష్టాలను తెలియజేస్తోంది.

అభి.! జబర్దస్‌ ప్రోగ్రాంతో.. అదిరే అభిగా మారిన అభి.. ఈ మధ్యే డైరెక్టర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. రాజ్ తరుణ్ హీరోగా జై చిరంజీవ సినిమాను తెరకెక్కించాడు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. నోటబుల్ వ్యూయింగ్ రేట్‌తో.. వన్‌ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఆహాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన అభి.. ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. ప్రభాస్‌ సినిమాలో యాక్ట్ చేస్తే.. జస్ట్ 11 వేలే తనకు రెమ్యునరేషన్‌గా ఇచ్చారంటూ ఒకప్పటి విషయాన్ని అందరితో పంచుకున్నాడు. అభి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా ప్రభాస్ ఈశ్వర్. 2002 లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో అభి ప్రభాస్ పక్కన త్రూ అవుట్‌ ద ఫిల్మ్ ఉంటాడు. అయినా కానీ తనకు తక్కువ రెమ్యునరేషన్ దక్కిందని అంటున్నాడు అభి. ఈశ్వర్ సినిమాకుగాను నిర్మాత అశోక్ కుమార్ అభి కి పదకొండు వేల రూపాయల చెక్ ఇచ్చారట. అలా సినీ పరిశ్రమలో తన మొదటి సంపాదన, అది కూడా ప్రభాస్ సినిమాకు పదకొండు వేలు అంటూ చెప్పుకొచ్చాడు అభి. అయితే అభి చెప్పిన ఈమాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్‌