Trisha – Nayanthara: అవును నయన్ తో గొడవలు నిజమే.. నిజం చెప్పిన త్రిష.

|

Jul 02, 2024 | 11:11 AM

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నారు. కానీ నాలుగు పదుల వయసు దాటినా కూడా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో త్రిష, నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఇద్దరూ హీరోయిన్స్ తమ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తూనే ఉంది.

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నారు. కానీ నాలుగు పదుల వయసు దాటినా కూడా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో త్రిష, నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఇద్దరూ హీరోయిన్స్ తమ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ అయితే ఈ ముద్దుగుమ్మలు ఎందుకు ఎడమొహం..పెడమొహంగా ఉంటున్నారు. ఈ ఇద్దరి మధ్యలో గొడవకు కారణం ఓ సినిమా అని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటంటో ఇప్పుడు చూద్దాం..

ఇక త్రిష, నయన్.. ఈ ఇద్దరూ చాలా కష్టపడి హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. ఇక అందులో త్రిష చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ హీరోయిన్ గా మారి.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నయన్ కూడా కష్టపడి హీరోయిన్ గా ఎదిగింది. ఈ ఇద్దరూ స్టార్ హీరోలందరి సరసన నటించారు. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు భారీ రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్స్ మధ్య ఒకానొక సందర్భంలో మంచి స్నేహం ఉండేది. కానీ ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందని తెలుస్తోంది.

ఇక గతంలో దీని పై స్వయంగా త్రిష రియాక్ట్‌ అయింది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే అని చెప్పింది. అయితే ఆ విబేధాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది త్రిష. అయితే ఆ తర్వాత కాలం గడుస్తున్నా కొద్దీ తాము ఒకరినొకరం అర్థం చేసుకున్నామని అదే ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఈ ఇద్దరికీ మధ్య గ్యాప్ రావడానికి ఓ సినిమా కారణం ఎప్పటి నుంచో వినిపిస్తున్న గుసగుసల్లో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు లేకుండా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.