స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోసం 70 లక్షలు వదులుకున్న శ్రీదేవి వీడియో!
దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల్లో నటించిన చిత్రం ‘మామ్’ (Mom). బోనీ కపూర్ నిర్మాతగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం షూటింగ్ విశేషాలను తాజాగా బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘మామ్’ కోసం శ్రీదేవి ఎంతో కష్టపడినట్లు చెప్పారు. శ్రీదేవి బాలీవుడ్‌కు వచ్చినప్పుడు ఆమెకు హిందీ మాట్లాడడం తెలియదనీ మొదటి ఆరు సినిమాలకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారనీ బోనీకపూర్ తెలిపారు.
తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్ థియేటర్‌లో హిందీ పాఠాలు నేర్చుకొని తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిందనీ అన్నార. తన చివరి చిత్రం ‘మామ్’ MOM లో ఎంతో అంకితభావంతో నటించిందనీ ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లకు స్వయంగా ఆమె డబ్బింగ్ చెప్పిందనీ మలయాళం పనులను దగ్గరుండి చూసుకుందనీ అన్నారు. అలాంటి నిబద్ధత చాలా తక్కువమంది ఆర్టిస్టులకు ఉంటుందని బోనీకపూర్ ప్రశంసించారు. మామ్ కోసం శ్రీదేవి రెమ్యునరేషన్‌లో కొంతభాగం వదులుకున్నట్లు ఆయన ఇన్నాళ్లకి బయటపెట్టారు. సినిమా కోసం ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలని అనుకున్నామనీ అయితే, ఇండస్ట్రీలో ఉన్న ఖరీదైన సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు కావడంతో తాము ఆలోచనలో పడ్డామనీ అన్నారు. అప్పుడు శ్రీదేవి తన రెమ్యునరేషన్‌లో 70 లక్షల రూపాయలు ఆయనకు ఇవ్వాలని చెప్పిందనీ దీంతో తమ పని సులువైందని చెప్పారు. ఇక ‘మామ్’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి తనతో రూమ్ పంచుకోవడానికి కూడా నిరాకరించిందని బోనీ కపూర్ తెలిపారు. పాత్రపై పూర్తిగా దృష్టిపెట్టాలని, మైండ్ డైవర్ట్ కాకుండా ఉండాలని ఒంటరిగానే రూమ్‌లో ఉండేదనీ అన్నారు. నోయిడా, జార్జియాలో షూటింగ్ జరిగే సమయంలోనూ రూమ్‌లో తను ఒంటరిగా ఉండేదనీ ఎప్పుడూ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకునేదని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
జాగ్రత్త : కారు సన్‌రూఫ్ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో
విశాఖపట్నంలో ఘనంగా మహాసిమెంట్స్ వార్షిక సమావేశం వీడియో
ఢిల్లీలో ఒక్కసారిగా కూలిన భవనం వీడియో
తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో
