Shivani Rajasekhar: నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..

|

Sep 18, 2024 | 12:15 PM

ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఏకంగా 100 కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఏకంగా 100 కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే ఈ బ్యూటీ ప్లేస్‌లో మొదట రాజశేఖర్ కూతురు శివానీ యాక్ట్ చేయాల్సి ఉంది. రీసెంట్‌గా ఇదే విషయాన్ని ఈమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో పాటే తనకు చెప్పిన కథ మరీ బోల్డ్ గా ఉందంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఉప్పెన సినిమా ఆఫర్ మొదట తనకే వచ్చిందని చెప్పిన శివానీ.. డైరెక్టర్ మొదట తనకు చెప్పిన కథకు.. తెరకెక్కించిన సినిమాకు చాలా తేడా ఉందని కామెంట్ చేసింది. ముందుగా కథను డైరెక్టర్ బుచ్చిబాబు బోల్డ్ గా రాశారని.. అదే కథ తనకు చెప్పాడని శివానీ చెప్పింది. అందులో లిప్ లాక్స్ , అలాగే మరికొన్ని కూడా హద్దులు దాటేలా ఉన్నాయని అంది. తాను అప్పుడు అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదని.. భయం మేసిందని.. అందుకే ఆ సినిమాకు తాను నో చెప్పినట్టు అసలు విషయం చెప్పింది. కానీ ఫైనల్‌గా సినిమా చూశాక మాత్రం కాస్త డిస్సపాయింట్ అయ్యాను అంటూ.. సాడ్ ఫేస్ పెట్టింది ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.