Siddharth and Aditi Rao Hydari: సిద్ధార్థ్, అదితి కి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Siddharth and Aditi Rao Hydari: సిద్ధార్థ్, అదితి కి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Anil kumar poka

|

Updated on: Sep 18, 2024 | 12:08 PM

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తిలోని శ్రీ రంగనాయక స్వామీ దేవాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి పెళ్లి.. వేడుకగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే. నా నక్షత్ర లోకం కూడా నువ్వే.

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తిలోని శ్రీ రంగనాయక స్వామీ దేవాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి పెళ్లి.. వేడుకగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే. నా నక్షత్ర లోకం కూడా నువ్వే. శాశ్వతంగా మనిద్దరం సోల్ మేట్స్ గా ఉండటానికి.. నవ్వడానికి.. జీవించేందుకు తోడుగా ఉండాలి. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు” అంటూ రాసుకొచ్చింది అదితి. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. నూతన వధూవరులకు సంబంధించిన ఆస్తి వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అదితి.. వనపర్తి సంస్థానాధీశుల మనవరాలు. ఇప్పటివరకు ఆమె 60 నుంచి 65 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. అలాగే సిద్ధార్థ్ నికర ఆస్తుల విలువ దాదాపు 70 కోట్లు ఉంటుందని టాక్. ఇద్దరి ఆస్తులు కలిపి చూస్తే.. మొత్తం 130 నుంచి 135 కోట్ల వరకు ఉంటుందట. అదితి ప్రతీ సినిమాకు లేదా వెబ్ సిరీస్ కోసం కోటి వరకు తీసుకుంటుందట. ఇటీవలే సంజయ్ భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ కోసం 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. ప్రస్తుతం గాంధీ టాక్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక సిద్ధార్థ్ ఒక్కో సినిమాకు 4 కోట్లు తీసుకుంటున్నారు. ఇటీవలే కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2లో కీలకపాత్ర పోషించాడు. ఈ మూవీ కోసం 4 కోట్లు తీసుకున్నాడట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.