బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన ఒకే ఒక్క హీరోయిన్

|

Dec 27, 2024 | 1:14 PM

‘పుష్ప-2’ ప్రీమియర్ షోల్లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ తొక్కిసలాటలో..రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలకు కారణమైంది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంధ్య థియేటర్ నిర్వాహకులతో పాటు హీరో అల్లు అర్జున్ పైనా కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఏ 11గా ఉన్న బన్నీని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చినా ఈ ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మరోసారి ఈ ఘటనపై మాట్లాడడం, ఆ తర్వాత పోలీసులు మరోసారి అల్లు అర్జున్ ను విచారణకు పిలవడం జరిగింది. ఈ ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు దూరం పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సినీ పెద్దలు సీఎం రేవంత్‌ తో భేటీ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దాంతో పాటే.. హీరోయిన్ సంజన.. అల్లు అర్జున్ కు సపోర్ట్‌ గా ట్వీట్ చేయడం .. నేషనల్ మీడియా డిస్కషన్స్‌లో మాట్లాడడం కూడా.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ కూల్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!

TOP 9 ET News: సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీకి దూరంగా చిరు.. కారణం ఇదే

Sai Pallavi: తెలంగాణ కథలతో కనెక్ట్‌ అవుతున్న సాయిపల్లవి

కాలు మోపితే కాటికే.. భయంకరమైన మృత్యు గుహ !!