Kerala: ఆ నిర్మాత నన్ను లైంగికంగా వేధించాడు.. నటి రేవతి సంపత్‌ ఆరోపణ.!

|

Aug 28, 2024 | 5:21 PM

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్లలో ఇప్పటికే వణుకు మొదలైంది. వారి కింద కుర్చీలు కదులుతున్నాయి. తాజాగా నటి రేవతి సంపత్‌.. నిర్మాత సిద్ధిఖీ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. దాంతో మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశారు.

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్లలో ఇప్పటికే వణుకు మొదలైంది. వారి కింద కుర్చీలు కదులుతున్నాయి. తాజాగా నటి రేవతి సంపత్‌.. నిర్మాత సిద్ధిఖీ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. దాంతో మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశారు. ఇక బెంగాలీ నటి శ్రీలేఖ.. దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌ పై ఆరోపణలు చేసింది. ఆడిషన్‌ కోసం పిలిచి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది. శ్రీలేఖ వ్యాఖ్యలపై స్పందించిన రంజిత్‌.. ఆమెవి కేవలం ఆరోపణలు మాత్రమే అని అన్నారు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలు వేస్తున్నారని చెప్పారు. అయితే శ్రీలేఖ ఆరోపణలతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన కేరళ చలచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

శనివారం ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సిద్ధిఖిపై నటి రేవతి సంపత్‌ చేసిన తీవ్ర ఆరోపణలు వైరల్‌గా మారాయి. 21 ఏళ్ల వయసులో తానొక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాననీ ఒక సినిమా గురించి చర్చించడానికి తనను కలవాలనుకుంటున్నట్లు సిద్ధిఖీ ఫేస్‌బుక్‌లో సందేశం పంపారనీ.. కూతురనే అర్థం వచ్చేలా తనను పిలిచారనీ ఆమె తెలిపింది. దాంతో ఎలాంటి భయం లేకుండా అతన్ని సంప్రదించగా ఆ సమయంలో అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనీ చెప్పింది. ప్రస్తుతం అందరూ చూస్తుంది ఆయన నిజ స్వరూపం కాదనీ ఆయనలోని మరో కోణాన్ని తాను చూశాననీ తెలిపింది. శారీరకంగా, మానసికంగా ఆయన తనను బాధించాడనీ తన దృష్టిలో ఆయనొక క్రిమినల్‌ అని చెప్పింది. ఈ సంఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానీ.. దీనివల్ల తన కెరీర్‌ కూడా దెబ్బతిందనీ ఆరోపించింది. ఏ వ్యవస్థా తనకు సాయంగా నిలబడలేదనీ చెప్పింది. అంతేకాదు ఈ విషయంపై మాట్లాడటానికి తనకు చాలా సమయం పట్టిందని శనివారం ఓ ఇంటర్వ్యూలో రేవతి సంపత్‌ ఆరోపణలు చేసింది. ఇది వైరల్‌గా మారిన తరుణంలో ‘ఏఎంఎంఏ’ జనరల్‌ సెక్రటరీ పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on