Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌..

Updated on: Mar 14, 2024 | 12:17 PM

తెనాలికి చెందిన గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆమె మరణంలో ఏదో కుట్ర దాగి ఉందంటూ టీడీపీ, జనసేన మద్దతు దారులు వైసీపీకి కౌంటర్లు వేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన గీతాంజలి మరణంపై టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్‌ కౌర్ స్పందించింది.

తెనాలికి చెందిన గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆమె మరణంలో ఏదో కుట్ర దాగి ఉందంటూ టీడీపీ, జనసేన మద్దతు దారులు వైసీపీకి కౌంటర్లు వేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన గీతాంజలి మరణంపై టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్‌ కౌర్ స్పందించింది. మృతురాలికి న్యాయం జరగాలంటే, దీనికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్ చేసింది. “గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలికి ఎందుకు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది? ఒక పార్టికి చెందిన సోషల్‌ మీడియా‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా? అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించండి. ఆ గీతాంజలి బిడ్డలకు న్యాయం చేయండి” అని ట్వీట్ చేసింది పూనమ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఫ్రెండ్స్‌తో గడపాలని నా భర్త ఒత్తిడి చేశాడు’ స్టార్ హీరోయిన్ ఆవేదన

HanuMan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హనుమాన్ టీం..

Thalapathy Vijay: దళపతి కోటి రూపాయల విరాళం.. విశాల్ ఎమోషనల్

Premalu: ‘ప్రేమలు’ చూసి మహేష్ ఫిదా.. నవ్వలేక చచ్చాడట!

Devi Sri Prasad: కల నెరవేరిన వేళ.. ఖుషీ ఖుషీగా దేవీశ్రీ