సన్యాసం తీసుకున్న మరో హీరోయిన్.. ఇదేంటిలా?

Updated on: Feb 09, 2025 | 7:13 PM

గత కొన్ని రోజులుగా ఉత్తర ప్రదేశ్‏లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే కోట్లాది మంది కుంభమేళాకు తరలివస్తున్నారు. మరోవైపు సినీతారలు కూడా ప్రయాగ్ రాజ్‏కు క్యూ కట్టారు. సాధువులు, అఘోరాలు, ఋషులు, పలువురు సెలబ్రెటీలు కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందు తండోపతండాలుగా వస్తున్నారు.

అయితే కొందరు బ్యూటీలు.. బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం.. సన్యాసం తీసుకునేందుకు కుంభమేళాకు వస్తున్నారు. సన్యాస వేషంలో… ఫోటోలు దిగి నెట్టింట వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేం పిచ్చి అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ ఇషికా.. కుంభమేళాలో సన్యాసం స్వీకరించి నెట్టింట ట్రోల్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలో పుణ్యస్నానమాచరించి సన్యాసం తీసుకున్నారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె బాటలోనే మరో బాలీవుడ్ హీరోయిన్ ఇషికా తనేజీ కూడా సన్యాసం స్వీకరించింది. తనేజా మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సంచలనమైన ఈ హీరోయిన్.. ఇప్పుడు కుంభమేళాలో సన్యాసం తీసుకుని అభిమానులకు షాకిచ్చింది. ఇకపై తాను సినిమాల్లో నటించనని తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాకింగ్ న్యూస్.. సాయిపల్లవి డైరెక్షన్లో… నాగ చైతన్య హీరోగా సినిమా!

శోభితపై దారుణ విమర్శలు! బాధపడిన నాగ చైతన్య..

ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. చివరికి పెళ్లిగా మారింది!

ఈ బ్యూటీ సంపాదన తెలిస్తే మన హీరోయిన్స్ బోరున ఏడ్చేయరూ

సినీ ప్రముఖుల‌తో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌.. చిరంజీవి స్పెషల్‌ థాంక్స్‌