Malavika: ఆడిష‌న్లో యువ న‌టికి చేదు అనుభ‌వం.. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలే..

|

Apr 19, 2023 | 8:19 PM

త‌న‌కు ఆడిష‌న్ ఏర్పాటు చేసిన వ్య‌క్తే త‌న‌పై అఘాయిత్యానికి ప్ర‌య‌త్నించాడ‌ని మాళ‌విక తెలిపింది. ఆడిష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌న త‌ల్లి, సోద‌రి ఆ గ‌ది బ‌య‌టే ఉన్నార‌ని.. ఐతే లోప‌ల త‌న‌తో ఆడిష‌న్ చేయించిన వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని మాళ‌విక చెప్పింది.

యువ న‌టి మాళ‌విక శ్రీనాథ్ తాజాగా త‌న‌కు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం గురించి ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పిన మాట‌లపై చర్చ మొదలైంది. మలయాళంలో మంజు వారియ‌ర్ కీల‌క పాత్ర పోషించిన ఓ సినిమాలో ఆమె కూతురి పాత్ర కోసం ఆడిష‌న్‌కు పిలిచి త‌న‌పై ఒక వ్య‌క్తి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు మాళ‌విక ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. త‌న‌కు ఆడిష‌న్ ఏర్పాటు చేసిన వ్య‌క్తే త‌న‌పై అఘాయిత్యానికి ప్ర‌య‌త్నించాడ‌ని మాళ‌విక తెలిపింది. ఆడిష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌న త‌ల్లి, సోద‌రి ఆ గ‌ది బ‌య‌టే ఉన్నార‌ని.. ఐతే లోప‌ల త‌న‌తో ఆడిష‌న్ చేయించిన వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని మాళ‌విక చెప్పింది. త‌న జుట్టు స‌రిగా లేద‌ని చెప్పి ఒక గ‌ది లోప‌లికి పంపించిన ఆ వ్య‌క్తి.. ఉన్న‌ట్లుండి వ‌చ్చి వెనుక నుంచి త‌న‌ను వాటేసుకున్నాడ‌ని ఆమె వెల్ల‌డించింది. తాను విడిపించుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. కొంచెం స‌ర్దుకుపోతే మంజు వారియ‌ర్ కూతురి పాత్ర త‌న‌కే ద‌క్కుతుంద‌ని చెప్పాడ‌ని.. కానీ తాను ఆ వ్య‌క్తి నుంచి త‌ప్పించుకునేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాన‌ని.. ఈ క్ర‌మంలో అక్క‌డుకున్న కెమెరా కింద ప‌డ‌టం.. అత‌ని దృష్టి దాని మీదికి మ‌ళ్లడంతో అక్క‌డి నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డ్డాన‌ని.. ఈ అనుభ‌వం త‌న‌ను తీవ్రంగా భ‌య‌పెట్టింద‌ని ఆమె చెప్పింది. ఒకప్పుడు తమపై జరిగే లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యే మహిళలు చాలా తక్కువగా కనిపించేవారు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో వేధింపులు జరుగుతున్నా నోరు విప్పేవాళ్లు కాదు. కానీ ‘మీ టూ’ ఉద్యమం తర్వాత ఎంతోమంది మౌనం వీడారు. సినీ పరిశ్రమలోనే కాక వివిధ రంగాల్లో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మహిళలు గళం విప్పారు. ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..