అప్పుడు మాయం.. ఇన్నాళ్లకు ప్రత్యక్షం !! నాటి హీరో దీనగాథ
"ఈరోజుల్లో" సినిమాతో గుర్తింపు పొందిన నటుడు శ్రీ (మంగం శ్రీనివాస్), టాలీవుడ్ నుండి దూరమై ఇప్పుడు విజయవాడలో వ్యవసాయ యంత్రాల వ్యాపారం నడుపుతున్నారు. తండ్రి మరణం, సరైన అవకాశాలు లేకపోవడమే సినిమాలు వదిలేయడానికి కారణమని శ్రీ వెల్లడించారు. అతని కొత్త జీవితం, వ్యాపారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
2012లో ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి తెరకక్కించిన ఈరోజుల్లో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ అలియాస్ మంగం శ్రీనివాస్. ఈ రోజుల్లో మూవీ తర్వాత రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్ ఇలా దాదాపు 12 సినిమాలు చేసిన శ్రీ.. ఆ తర్వాత ఉన్నట్టుండి టాలీవుడ్ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుకుంటూ రీసెంట్‌గా కనిపించాడు. తాను ఎందుకు సినిమాలు వదిలేయాల్సి వచ్చిందో చెప్పాడు. తన మాటలతో .. తన నయా వృత్తితో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. 2020లో కొవిడ్ కారణంగా తన తండ్రి చనిపోయారని చెప్పిన శ్రీ.. ఆ తర్వాత తాను ఈ బిజినెస్ లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు. ఇది తమ ఫ్యామిలీ బిజినెస్ అని.. తాత నుంచి తండ్రికి, ఆయన నుంచి తనకు వచ్చిందన్నాడు. దీనితో పాటు హైదరాబాద్‌లో వారాహి స్టూడియోస్ అనే ఓ డబ్బింగ్ స్టూడియో కూడా ఉందని.. సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్లే తాను సినిమాల్లో సక్సెస్ కాలేక పోయానని అన్నాడు. తన భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహిస్తుందని.. కానీ తనకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయానంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ హీరో ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు.. అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం.. అబ్బా అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు..