Loading video

కుంభమేళాలో ప్రకాష్‌రాజ్‌ పుణ్యస్నానం! మోనార్క్‌ రియాక్షన్

|

Jan 29, 2025 | 5:11 PM

సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు, నకిలీ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు, ఫోటోల్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా కష్టతరమవుతోంది. వాటిని సరిగ్గా పరిశీలించకుంటే, నకిలీ ఫోటోలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది. తాజాగా, సీనియర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటో విషయంలో నెట్టింట తెగ చర్చ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుంభమేళాలో ఆయన పుణ్యస్నానం చేసినట్టు ఎవరో ఫొటో క్రియేట్‌ చేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అది వాస్తవం అనుకున్న కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు. నాస్తికుడని చెప్పుకొనే మీరు కుంభమేళాకి వెళ్లారంటే ఏమనాలి? అంటూ కామెంట్లు పెట్టారు. సంబంధిత ఫొటో ప్రకాశ్‌రాజ్‌ దృష్టి వెళ్లడంతో ఆయన ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి వైరల్‌ అవుతున్న ఫోటో, వార్త.. అంతా నకిలీ అని ప్రకాష్‌రాజ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది. ఇలా చేయడం సిగ్గుచేటు’ సంబంధిత వ్యక్తులు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కన్నడలో పోస్ట్ చేశారు. మహాకుంభ్ మేళాలో ప్రకాశ్ రాజ్‌ పాల్గొన్నారని తెలియగానే నెటిజన్స్‌ విభిన్నమైన కామెంట్స్ చేశారు. అయితే.. ప్రకాశ్ రాజ్ ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతోనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిర్మలమ్మ బడ్జెట్‌ మధ్యతరగతికి ఊరటనిస్తుందా?

బిగ్ పంచ్‌! OTT మరింత ఆలస్యం సంక్రాంతికి వస్తున్నాం?

సరిగ్గా లెక్కేస్తే రూ.45 వేల కోట్ల ఆస్తులు.. షాకిచ్చిన స్టార్ హీరో…

స్టార్ హీరోయిన్‌కు క్యాన్సర్‌.. దగ్గరుండి మరీ సేవలు చేస్తున్న భర్త

Anjali: గేమ్‌ ఛేంజర్‌ రిజల్ట్‌ పై అంజలి షాకింగ్ రియాక్షన్