నరేష్ – పవిత్ర మళ్లీ వైరల్ ఈ వీడియోనే కారణం
నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సహ జీవనం చేస్తున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇదివరకే ఇద్దరూ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరిపై ట్రోలింగ్ జరుగుతున్నా నరేష్ కానీ, పవిత్ర కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు.
తమకు నచ్చినట్లు లైఫ్ ను లీడ్ చేస్తన్నారు. తాజాగా నరేష్, పవిత్రా లోకేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. వెకేషన్ కోసం వెళుతూ విమానాశ్రమంలో జంటగా కనిపించారు. అయితే ఒక మహిళ వీరిని చూసింది. వెంటనే వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు నరేష్. ‘ఆమె ఎవరో తెలియదు కానీ, హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను, నన్ను కలిసి.. మీరు ఆమెపై చూపించే శ్రద్ధ,ప్రేమ.. మీరు ఆమెను అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకున్నాయి. మీరు గొప్ప పెద్ద మనిషి. మీ జీవితంలో ఆమెను పొందడం మీ అదృష్టం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి వెళ్లిపోయింది. అంతే కాదు మాకు కొన్ని స్వీట్లు కూడా బహుమతిగా ఇచ్చింది. ఆమె మాటలు, ముఖంలోని నిజాయితీ అన్నీ చెప్పాయని.. ఆమె ఎవరైనా తాము జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. ‘ఇది మా లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్. చాలా థ్యాంక్స్’ అని రాసుకొచ్చాడు నరేష్. ప్రస్తుతం నరేష్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరో సారి వీరిద్దర్నీ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు నరేష్, పవిత్ర.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTRకు లింక్ చేస్తూ.. హీరోయిన్‌పై RGV వెకిలి కామెంట్స్
నైట్ పార్టీకి వెళ్లింది.. స్కాంలో చిక్కుకుంది.. పాపం కయాదు
లక్కీ గర్ల్.. బిగ్ బాస్9 లోకి పచ్చళ్ల పాప
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

