RTOలో ఫ్యాన్సీ నంబర్లు వేలం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ దక్కించుకున్న నెంబర్‌ ఇదీ..? వీడియో

|

Sep 26, 2021 | 9:45 AM

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల ప్రత్యేక నంబర్లు వేలం వేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి 45,52,921 రూపాయల ఆదాయం దక్కిందని హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు.

YouTube video player

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల ప్రత్యేక నంబర్లు వేలం వేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి 45,52,921 రూపాయల ఆదాయం దక్కిందని హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని జమ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా TS09 FS 9999 నంబర్‌ను ప్రముఖ టాలీవుడ్‌ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ వేలంలో 17 లక్షలకు దక్కించుకున్నారు. లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు TS09 FT 0001 నంబర్‌ను 7,01,000కు, రతన్ నల్లా TS 09 FT 0009 నంబర్‌ను 3,75,999కు వేలంలో దక్కించుకున్నారని తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Tirumala Dharshan: వెంకన్న భక్తులతో సందడిగా మారిన తిరుపతి.. సర్వ దర్శనం టికెట్స్‌ దొరక్క..

Soldier Body Found: మిస్సైన 13 నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్‌ డెడ్‌బాడీ.. వీడియో