Aamir Khan: అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమీర్ ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అమీర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమీర్ ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అమీర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన అమీర్ ఖాన్ ఆ వీడియో ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. గత 35 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీని ఆమోదించలేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని అన్నారు.
ప్రస్తుతం తాను రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్న వీడియో వైరలవుతుందని.. అది పూర్తిగా ఫేక్ వీడియో అని అన్నారు. దీనిపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. గత ఎన్నికలలో ఎన్నికల సంఘం ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అమీర్ ఖాన్ ఫలానా రాజాకీయ పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో నకిలీదని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం అమీర్ ఖాన్ ఓ సందేశం ఇచ్చారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఎన్నికలలో చురుకుగా ఉండాలని అన్నారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియో మాత్రం ఆర్టిఫిషియేల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!