Nayanthara: నయన్ ఇంటికి కళ్లు చెదిరే భారీ బడ్జెట్.. తగ్గేదే లే అంటున్న కేరళ కుట్టి..
ఐదేళ్ళ ప్రేమను ఈ మధ్యే పెళ్లి బంధంగా మార్చుకున్నారు నయన్ విగ్నేష్ . పెళ్లి తర్వాత రెండు వారాల్లోనే మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు నయన్. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఓ ఇల్లు కొనుక్కున్నా..
ఐదేళ్ళ ప్రేమను ఈ మధ్యే పెళ్లి బంధంగా మార్చుకున్నారు నయన్ విగ్నేష్ . పెళ్లి తర్వాత రెండు వారాల్లోనే మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు నయన్. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఓ ఇల్లు కొనుక్కున్నా.. తాజాగా మరో ఇంటిని కూడా కొనేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఆ ఇంటి ఇంటీరియర్స్ కోసం ఓ భారీ బడ్జెట్ సినిమాకు అయ్యే ఖర్చు పెడుతోందట ఈ స్టార్. ఇప్పటికే నయనతార చెన్నైలోని ఖరీదైన పొయెస్ గార్డెన్‌లో ఓ బంగ్లాను కొన్నారు. చాలా రోజుల కిందే ఈ న్యూస్ వైరల్ అయింది. అయితే పెళ్ళి తర్వాత భర్త పేరుతో మరో బంగ్లాను కూడా నయన్ కొనేసిందనే ప్రచారం జరుగుతుంది. రజినీ, శశికళ, అజిత్ లాంటి ప్రముఖులు ఉంటున్న ప్లేస్‌లోనే నయన్ కోట్లు ఖర్చు చేసి రెండు ఇళ్ళను తీసుకున్నారట. ఇప్పుడు వాటి ఇంటీరియర్ కోసమే 25 కోట్లు ఖర్చు చేస్తుండటం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. నయనతార కొనుగోలు చేసిన ఈ రెండు ఇళ్ళకు చాలా ప్రత్యేకతలున్నాయట. ఒక్కో ఇల్లు దాదాపు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందని.. అందులో కేవలం స్విమ్మిగ్ పూల్ మాత్రమే 1500 చదరపు అడుగుల్లో ఉంటుందని తెలుస్తుంది. పైగా వీటిలో కేవలం నయన్, విగ్నేష్ కోసమే ఓ లిఫ్ట్.. పని వాళ్ళకి ప్రత్యేకంగా మరో లిఫ్ట్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే కొత్తింట్లోకి వెళ్లి కొత్త కాపురం మొదలుపెట్టాలని చూస్తున్నారు ఈ జోడీ. ఏదేమైనా నయన్ కొత్తింటి మ్యాటర్ మాత్రం వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?