A సర్టిఫికెట్ తో రూ.1000 కోట్లు పక్కా.. ఇది అరాచకం భయ్యా
సినిమా నిర్మాతలు 'A' సర్టిఫికేట్‌ను కోరి మరీ పొందుతున్నారు. ఇది కేవలం ప్రమాణం కాదు, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే ఒక వ్యాపార వ్యూహం. పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచి, కలెక్షన్లను పెంచుతుంది. యానిమల్, సలార్, ధురంధర్ వంటి చిత్రాల విజయమే దీనికి నిదర్శనం. ఈ వ్యూహం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.
A సర్టిఫికెట్ కావాలని దర్శక నిర్మాతలే సెన్సార్ బోర్డు సభ్యులను అడుగుతున్నారా..? తమ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ కోరి మరీ తెచ్చుకుంటున్నారా..? అదేంటి A వస్తే వాళ్లకే కదా నష్టం అనుకుంటున్నారు కదా..! అందులో కూడా బిజినెస్ స్ట్రాటజీ ఉంది. తాజాగా మరో A సర్టిఫికేట్ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుంది. మరి అదేంటో చూద్దామా..? A సర్టిఫికెట్ సినిమాల టైం నడుస్తుందిప్పుడు ఇండస్ట్రీలో. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు చెప్తున్నా థియేటర్స్ మాత్రం పిల్లా పెద్దలతో నిండిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా అడల్ట్స్ ఓన్లీ అని సెన్సార్ బోర్డు చెప్పిన సినిమాలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా A సర్టిఫికేట్‌తో 1000 కోట్ల వైపు అడుగులేస్తుంది ధురంధర్. సినిమాకు A సర్టిఫికెట్ వచ్చిందంటే అందులో ఏదో ఉందనే ఆసక్తి ఆడియన్స్‌లోనూ పెరిగిపోతుంది. అదే కలెక్షన్స్ పెంచేస్తుంది. A వచ్చిన తర్వాత హైయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా యానిమల్.. 900 కోట్లతో A రేటెడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఉంది ఈ సినిమా. దీని తర్వాత సలార్ సినిమా 650 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మామూలుగా A సర్టిఫికేట్ వస్తే పిల్లలకు నో ఎంట్రీ కాబట్టి.. ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇన్ని ప్రతికూలతలుంటాయి కాబట్టే కలెక్షన్ల వర్షం కురిసినా.. రికార్డులకు దూరంగా ఉంటాయి అడల్ట్ రేటెడ్ సినిమాలు. కూలీ సినిమాకు కేవలం A రావడం వల్లే 500 కోట్ల దగ్గర ఆగిపోయిందని నిర్మాతలే క్లారిటీ ఇచ్చారు. సినిమా అంటే కేరళ స్టోరీ, పవన్ కళ్యాణ్ ఓజి, కాశ్మీర్ ఫైల్స్ A సర్టిఫికేట్‌తోనే 300 కోట్ల వరకు వసూలు చేసాయి. ఇప్పుడు ధురంధర్ అడల్ట్ సర్టిఫికేట్‌తో 1000 కోట్లు వసూలు చేసేలా ఉంది. పైగా 2025లో ఏ సినిమా కూడా ఈ ఫీట్ చేయలేదు. ఇప్పటికే 750 కోట్లు వసూలు చేసింది ధురంధర్. కాలెండర్ మారేలోపు థౌజెండ్ వాలా పేల్చేలా ఉంది ఈ స్పై థ్రిల్లర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు