వెయ్యి కోట్ల వసూళ్ల రేసులో ఇండియన్ సినిమా

Edited By: Phani CH

Updated on: Oct 08, 2025 | 3:40 PM

ఇండియన్ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను దాటి దూసుకుపోతోంది. దీంతో పాన్ ఇండియా టార్గెట్‌తో బరిలో దిగుతున్న స్టార్ హీరోలంతా ఇప్పుడు వెయ్యి కోట్లు మిషన్‌తోనే రంగంలోకి దిగుతున్నారు. మరి ఈ రేసులో సత్తా చాటాలంటే ముఖ్యంగా కలిసి రావాల్సిన అంశాలేంటి..? వెండితెర మీద వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్‌ను క్రాస్ చేయటం అంటే మామూలు విషయం కాదు.

అందుకే ఇప్పటి వరకు కనీసం పది సినిమాలు కూడా ఈ క్లబ్‌లో చేరలేకపోయాయి. బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్‌ 2, ట్రిపులార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలు మాత్రమే సౌత్ నుంచి ఈ క్లబ్‌లో స్థానం సంపాదించాయి. దీంతో అసలు ఆ రేంజ్‌ కలెక్షన్లు సాధించాలంటే మెయిన్‌ మార్కెట్‌ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. వసూళ్ల విషయంలో నార్త్ సినిమాలు సౌత్‌ మూవీస్‌తో పోటీ పడలేకపోతున్నా… సౌత్‌ మూవీస్‌ కలెక్షన్స్ విషయంలో మాత్రం నార్త్ మార్కెటే కీ రోల్‌ ప్లే చేస్తోంది. దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయినప్పుడే బాక్సాఫీస్ నెంబర్స్‌ వెయ్యి కోట్ల మార్క్‌ను క్రాస్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2 సినిమాల విషయంలో ఈ ఫార్ములానే బాగా వర్కవుట్ అయ్యింది. ట్రిపులార్‌, కల్కి 2898 ఏడీ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ కీ రోల్స్‌లో కనిపించటంతో ఉత్తరాది ప్రేక్షకులు ఆ సినిమాలను ఓన్ చేసుకున్నారు. అందుకే ఆ సినిమాలు కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో సత్తా చాటాయి. మరి ఈ లెక్కలన్నీ చూసిన తరువాత అప్‌కమింగ్ మూవీస్‌ విషయంలో మేకర్స్‌ నార్త్ ఆడియన్స్‌ కోసం స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతకు మించి అనేలా ఉండబోతున్న AA 22.. హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..

Baahubali: బాహుబలి టీంలో రీ రిలీజ్ జోష్.. క్రేజ్ మామూలుగా లేదుగా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా

దెబ్బ మీద దెబ్బ.. మూసీవాసులకు నిద్రలేకుండా చేస్తున్న పాములు.. ఇంత ఉన్నాయేంటి మావ

Rajinikanth: డివోషనల్ ట్రిప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణం అదేనా ?