తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఏనుగుల గుంపు..
ఇటీవల మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది. తాజాగా, ఇప్పుడు ఆందోళన కలిగించే మరో వార్తను అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గడ్, ఒడిశాలో ఇటీవల అలజడి సృష్టించిన ఏనుగుల గుంపు ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ వైపుగా కదులుతున్న గుంపులో ఇటీవల ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇటీవల మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది. తాజాగా, ఇప్పుడు ఆందోళన కలిగించే మరో వార్తను అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గడ్, ఒడిశాలో ఇటీవల అలజడి సృష్టించిన ఏనుగుల గుంపు ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ వైపుగా కదులుతున్న గుంపులో ఇటీవల ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గడ్చిరోలి జిల్లాలో సంచరిస్తున్న ఈ గుంపు గోదావరి, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంతాల వైపుగా కదిలే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర జిల్లా సరిహద్దులోని భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, గడ్చిరోలి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: