Loading video

ఇక ఆధార్, మొబైల్‌తో ఓటర్ఐడీ లింక్ తప్పనిసరి

|

Mar 20, 2025 | 5:41 PM

ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓటర్‌ కార్డులు, ఓటర్ల సంఖ్యలో పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై విపక్షాలు ఎన్నికల సంఘాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్‌ గుర్తింపు కార్డులకు ఇకమీదట ఆధార్‌తోపాటు, మొబైల్‌ నెంబర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియలో తొలి అడుగు పడింది.

ఓటర్లను గుర్తించేందుకు ఓటర్ల జాబితాతో ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఇందుకోసం జనన-మరణాల నమోదు సంస్థలతో అనుసంధానం చేసుకోవాలని CEC ఆదేశించింది. బెంగాల్‌ రాష్ట్రం అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న పరిస్థితుల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌- ఓటర్ల జాబితాపై ఫోకస్‌ పెట్టింది. డూప్లికేట్‌ EPICల ద్వారా మోసం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపించింది. ఆ తర్వాత, CEC నుంచి వచ్చిన ఆదేశాలు కీలకంగా మారాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం ఇప్పటిదాకా ఆ సంస్థ తీసుకున్న వైఖరికి విభిన్నంగా ఉంది. ఇన్నాళ్లు ఓటర్‌ ఐడీ కార్డుకు, ఆధార్‌ లింక్‌ అవసరం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వచ్చింది. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఇదే చెప్పారు. మరోవైపు ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకత పాటించాలని, డూప్లికేట్ ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్లను తొలగించాలని కోరుతూ మూడు రాజకీయ పార్టీలు ఈసీఐకి వినతిపత్రాలు సమర్పించాయి. వివిధ స్థాయిల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఏప్రిల్ 30లోగా సలహాలు ఇవ్వాలని ఈసీఐ అన్ని పార్టీలను కోరింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాని Vs మోహన్ బాబు.. రసవత్తరమైన ఫైట్‌!

Chiranjeevi: లండన్‌లో మహిళా అభిమాని చేసిన పనికి చిరంజీవి రియాక్షన్‌

Manchu Manoj: ‘నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా నాన్న’ మనోజ్‌ ఎమోషనల్ ట్వీట్

ఈ ముగ్గురూ దేవుళ్లే..! తెలుగు వాళ్ల గుండెల్లో మోగుతున్న అన్వేష్ మాటలు

పెళ్లి చేసుకోమని శ్రీదేవి రిక్వెస్ట్.. అప్పట్లో షాకిచ్చిన మురళీ మోహన్