Chicken with Curd: చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!

|

Aug 30, 2024 | 3:42 PM

చికెన్ పేరు వినగానే మాంసాహార ప్రియుల నోరూరుతుంది. చికెన్ కర్రీ, చికెన్‌ ఫ్రై, తందూరీ చికెన్‌ ఇలా రకరకాలుగా వండుకుని తింటారు. అయితే చికెన్‌ ప్రియులకు ఆరోగ్య నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. అదేంటంటే.. చికెన్ కర్రీని అన్నంలోకి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలా చికెన్‌ కర్రీతో భోజనం చేసిన తర్వాత చివర్లో పెరుగు తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

చికెన్ పేరు వినగానే మాంసాహార ప్రియుల నోరూరుతుంది. చికెన్ కర్రీ, చికెన్‌ ఫ్రై, తందూరీ చికెన్‌ ఇలా రకరకాలుగా వండుకుని తింటారు. అయితే చికెన్‌ ప్రియులకు ఆరోగ్య నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. అదేంటంటే.. చికెన్ కర్రీని అన్నంలోకి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలా చికెన్‌ కర్రీతో భోజనం చేసిన తర్వాత చివర్లో పెరుగు తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చికెన్‌ని పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది పెరుగు వేసి చికెన్‌ వండుతుంటారు. చికెన్‌ తిన్న తర్వాత కూడా చాలా మంది పెరుగు తింటుంటారు. అయితే, ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, చికెన్‌తో పాటు పెరుగును తినటం మంచిది కాదని చెబుతున్నారు. చికెన్‌ ప్రభావం మన శరీరంపై వేడిగానూ, పెరుగు ప్రభావం శరీరంపై చల్లగానూ ఉంటుంది. ఈ రెండింటి ఎఫెక్ట్.. జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందన్నారు.

అంతేకాదు.. చికెన్‌ తిన్న తర్వాత పాలు తాగడం కూడా మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరికి రాత్రి భోజనం తర్వాత పాలు తాగి పడుకోవడం అలవాటుంటుంది. అయితే చికెన్‌ తిన్న రోజు పాలు తాగకపోవడమే మంచిదంటున్నారు. దీని వల్ల కొంతమందికి శరీరంపై దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on