అందరూ గాఢ నిద్రలో ఉండగా ఊహించని షాక్‌.. భయంతో జనం పరుగులు..

|

Nov 16, 2022 | 8:25 AM

ఉత్తర భారతాన్ని వరస భూకంపాలు వణికిస్తున్నాయి. హిమాలయ సీమలో వస్తున్న భూ ప్రకంపనలు కలవరపెడుతున్నాయి.

ఉత్తర భారతాన్ని వరస భూకంపాలు వణికిస్తున్నాయి. హిమాలయ సీమలో వస్తున్న భూ ప్రకంపనలు కలవరపెడుతున్నాయి. నేపాల్, ఢిల్లీ లో వచ్చిన భూకంప ఘటనలను మరవకముందే మరోసారి పంజాబ్ ను భూకంపం వణికించింది. అమృత్ సర్ లో నవంబరు 14 తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో 3 గంటల 42 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమి నుంచి 120 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్ దేశంలో వచ్చిన భూకంపాలతో ఉత్తరాఖండ్, ఢిల్లీ ఇతర పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి పరుగులు తీశారు. నవంబరు 12 రాత్రి 8 గంటలకు నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే.. హిమాలయాల్లో ఎప్పుడైనా భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి కేవలం ట్రయల్స్‌ మాత్రమేనని అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Superstar Krishna Final Journey: పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం.. లైవ్ వీడియో

Follow us on