చలికాలంలో పెదవులు పలిగిపోతున్నాయా ?? ఇది మీకోసమే
చలికాలంలో పెదవులు పొడిబారడం, పగలడం సహజం. రసాయనాలు లేని ఇంటి చిట్కాలతో వీటిని సులభంగా తగ్గించుకోవచ్చు. తేనె, కొబ్బరి నూనె, బాదం నూనె వంటివి పెదవులను మృదువుగా చేస్తాయి. చక్కెర స్క్రబ్ మృత కణాలను తొలగిస్తుంది. తగినంత నీరు త్రాగడం కూడా పగుళ్లను నివారిస్తుంది. ఈ సహజ పద్ధతులతో ఆరోగ్యవంతమైన పెదవులను పొందండి.
చలికాలం వచ్చిదంటే చాలు, చర్మం పొడిబారడం, పెదవులు, చర్మం పగలడం వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పెదవులు పలకడంతో రకరకాల క్రీమ్స్, లిప్ బామ్ రాస్తుంటారు. కానీ ఇవేవీ లేకుండా ఇంట్లో అందుబాటులో ఉన్నవాటితోనే పెదవుల పగళ్లుకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా దీనిలో సహజ మాయిశ్చరైజర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన చలికాలంలో పెదవులకు తేనె పూయడం వలన పెదవులు మృదువుగా మారుతాయి. తేనెను పెదవులపై పలుచని పొరలా రాసి, 15 నిమిషాలపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని, పెదవులను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన పగుళ్లు తగ్గిపోతాయి. పెదవుల పగుళ్లను అరికట్టడానికి కొబ్బరి నూనె, బాదం నూనె అప్లై చేయవచ్చు. దీని వలన పెదవులు మృదువుగా తయారు అవుతాయి.పెదవులపై చక్కెరతో స్క్రైబ్ చేసినా పగిలిన పెదవులు సున్నితంగా తయారు అవుతాయి. పెదవులపై ఉన్న మృత కణాలు తొలిగిపోతాయి. చాలా వరకు చలికాలంలో పెదవులు తగినంత నీరు తాగకపోవడం వలన పగులు తుంటాయి. అందుకే వీలైనంత వరకు ఎక్కువగా నీరు తాగాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది పిచ్చి మొక్క కాదు.. క్యాన్సర్‌ను అరికట్టే దివ్యౌషధం
10 దేశాల మీదుగా.. 300 ఉప నదులను కలుపుకుంటూ
