సాధారణంగా శునకాలు 10 నుంచి 13 ఏళ్లు జీవిస్తాయి. కొన్ని జాతుల కుక్కులు అంతకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే.. ఓ శునకం మాత్రం గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఇంతకీ ఏంటీ విషయం అంటారా.. విషయం కాదండి విశేషం. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ కుక్క 21 ఏళ్లుగా జీవిస్తోంది మరి. ప్రపంచంలోనే భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద వయస్సు గల శునకంగా చివావా(కుక్క పేరు) ప్రపంచ రికార్డు సాధించింది. చువావా టోబీకీత్ జనవరి 9, 2001న జన్మించింది. దీని వయస్సు ఇప్పుడు 21 సంవత్సరాల 97 రోజులు. గ్రీన్‌కర్స్‌కి చెందిన గిసెలా షోర్.. టోబికీత్‌ను జంతువుల ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. అప్పటినుంచి తనతో టోబికిత్ జర్నీ చేస్తున్నదని, తన జీవితంలో పెంపుడు కుక్కకు ప్రత్యేక స్థానం ఉందని గిసెలా షోర్ వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే షోర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్సు గల శునకంగా రికార్డుల్లోకెక్కిన చువావా వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read
Viral Video: తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో ఖంగుతిన్న వరుడు షాకింగ్ నిర్ణయం.. అంతా కొలాప్స్..
కిచిడిలో ఉప్పు ఎక్కువైందని ఘాతుకం.. భార్యపై భర్త ఏం చేశాడో తెలుసా..?